ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై విద్యార్థుల్లో గందరగోళం

Published: Wednesday July 03, 2019
 à°°à°¾à°·à±à°Ÿà±à°°à°‚లో ఇకపై తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మెడికల్‌, ఇంజనీరింగ్‌, ఫార్మసీ విద్యార్ధులకు ర్యాంకుతో సంబంధం లేకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేస్తామంటూ వైసీపీ అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో చేసిన ప్రకటనపై ప్రస్తుతం గందరగోళం నెలకుని ఉంది. దీనిపై విద్యాశాఖ మంత్రి ఆదిమలుపు సురేష్‌ మంగళవారం పత్రికా విలేకరుల సమావేశంలో కూడా స్పష్టమైన ప్రకటన చేయలేదు. దీంతో నేటినుంచి వెబ్‌ కౌన్సెలింగ్‌కు వెళ్ళనున్న ఇంజనీరింగ్‌ విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో తీవ్ర గందరగోళం నెలకుని ఉంది. ఇప్పటివరకు తెలుగుదేశం ప్రభుత్వం ఇంజనీరింగ్‌లో పదివేల ర్యాంకు లోపు వచ్చిన వారికి కుల, సంపాదనతో సంబంధం లేకుండా అన్ని కళాశాలలకు పూర్తిస్థాయిలో గ్రేడులను బట్టి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేసింది. ఎన్నికల సమయంలో జగన్‌మోహన్‌రెడ్డి ర్యాంకుతో సంబంధం లేకుండా ఆయా కళాశాలల గ్రేడులు, గ్రూపులను బట్టి ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులను అందరి విద్యార్థులకు పూర్తిస్థాయిలో చెల్లిస్తామంటూ హామీ ఇచ్చారు.
 
 
ప్రస్తుతం ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌కు లక్షమందికి పైగా విద్యార్ధులు à°ˆ వారం రోజుల్లో వెళ్లనున్నారు. వీరిలో 10వేల ర్యాంకు లోపు వారికి ఎటువంటి సమస్య లేదు.. అయితే ఆపై వచ్చిన ర్యాంకుల వారు గందరగోళంలో ఉన్నారు.. కారణం ఏ గ్రేడ్‌ కాలేజీలకు ప్రస్తుత ప్రభుత్వం రూ.లక్షా 20వేలు ఫీజుగా నిర్ణయించింది. కానీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రూ.45వేలు మాత్రమే ఇస్తామంటూ అధికారులు కౌన్సెలింగ్‌ సెంటర్ల వద్ద చెబుతున్నారు. దీంతో పేద విద్యార్ధులు లక్షా 20వేలలో 45వేలు పోను రూ.75 వేలు చెల్లించుకోలేని స్థితిలో ఉన్నారు.
 
వీరు మంచి కళాశాలలో చదివే అవకాశం ఉన్నప్పటికీ ఫీజు కట్టుకోలేక అంతగా వసతులు లేని సీ గ్రేడ్‌ కళాశాలలకు వెళ్ళిపోయే అవకాశం ఉంది. à°—à°¤ నాలుగేళ్ళ నుంచి కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఫీజులు కట్టుకోలేని కుటుంబాలు వారికి ప్రభుత్వం ఇచ్చే 45వేలతో వచ్చే కాలేజీలోనే అడ్మిషన్లు పొందుతున్నారు. దీంతో ప్రతిభ ఉండి కూడా పేద విద్యార్థులు నాణ్యమైన ఇంజనీరింగ్‌ విద్యకు దూరంగా ఉంటున్నారు. అదే ప్రభుత్వం వెంటనే దీనిపై స్పష్టమైన ప్రకటన చేస్తే పేద విద్యార్ధులు పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వస్తుందని నాణ్యమైన కళాశాలల్లోనే సీటు పొందే అవకావం ఉంటుంది. ప్రభుత్వం నేటినుంచి ఆలస్యం చేస్తే పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారు. కారణం à°ˆ ఐదురోజుల్లోనే వెబ్‌ కౌన్సెలింగ్‌ పూర్తియిపోతుంది. అనంతరం ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై స్పష్టమైన ప్రకటన చేసినా విద్యార్థులు మరలా నాణ్యమైన కాలేజీలకు వెళ్ళే పరిస్థితి ఉండదు.
 
మొదటి కౌన్సెలింగ్‌లోనే ఎక్కువమంది విద్యార్ధులు వాటిలో సీట్లు పొందే పరిస్థితి ఉంటుంది. దీంతో అవకాశం ఉండి కూడా కోల్పోయిన నిరుపేద విద్యార్థులు నాలుగేళ్ళ పాటు నాణ్యత లేని కళాశాలలోనే చదవాల్సి ఉండడమే కాకుండా భవిష్యత్తు కూడా తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుంది. అనంతరం ప్రకటించినా వెనక్కి వచ్చే పరిస్థితి ఉండదు. అందు వల్ల ప్రభుత్వం జాప్యం చేయకుండా స్పష్టమైన ప్రకటన చేసి నిరుపేద విద్యార్ధుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిందిగా తల్లిదండ్రులు ఆకాంక్షిస్తున్నారు.