ధర్మవరం టీడీపీ ఇన్‌చార్జ్‌పై కసరత్తు

Published: Thursday July 04, 2019
ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ నియామకం కోసం à°† పార్టీ జిల్లా నేతలు కసరత్తు చేస్తున్నారు. ఇటీవల ధర్మవరానికి చెందిన మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ టీడీపీ నుంచి బీజేపీలో చేరారు. 2014 ఎన్నికల్లో à°† నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన à°—à°¤ తొమ్మిదేళ్లుగా టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. మాజీ సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితులుగా ఉంటూ జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. 2019 ఎన్నికల్లో ఆయన టీడీపీ తరపున పోటీ చేసి వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చేతిలో ఓడిపోయారు. 2014నుంచి 2019 వరకూ ఐదేళ్లపాటు సూర్యనారాయణ ఎమ్మెల్యేగా ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారు. అయినా à°—à°¤ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. దీంతో ఆయన బీజేపీలో చేరారు.
 
à°ˆ పరిస్థితుల్లో ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ నాయకుడి à°…à°‚à°¡ కోల్పోయినట్టయింది. పార్టీ శ్రేణులు అభద్రతా భావంలో ఉన్నారు. à°ˆ తరుణంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ధర్మవరం నియోజకవర్గంలో నాయకత్వ కొరతను తీర్చేందుకు మాజీ సీఎం చంద్రబాబు సూచనలతో రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఇప్పటికే à°† నియోజకవర్గంలో ఎలాంటి నాయకులైతే పార్టీకి గట్టిగా నిలబడతారో అంచనా వేస్తున్నారు. స్థానికంగా ఉండే పలువురు టీడీపీ నాయకుల వివరాలను సేకరించిన బాలకృష్ణ.. కొందరితో నేరుగా మాట్లాడినట్టు సమాచారం. ఇదే పరిస్థితుల్లో జిల్లా టీడీపీ నాయకులు కూడా ధర్మవరం నియోజకవర్గంలో ఇన్‌చార్జి నియామకానికి శ్రీకారం చుట్టారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సూచనలతో à°† నియోజక వర్గంలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలను బుధవారం జిల్లా పార్టీ కార్యాలయానికి పిలిపించుకుని విడివిడిగా అభిప్రాయాలు సేకరించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ధర్మవరంలో పార్టీకి గట్టిగా నిలబడి పనిచేసే నాయకత్వంకోసం అన్వేషిస్తున్నారు. నియోజకవర్గ పార్టీ శ్రేణుల అభిప్రాయాలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లనున్నారు.