గృహరుణం వడ్డీపై మరో లక్షన్నర రాయితీ

Published: Saturday July 06, 2019
తాజా బడ్జెట్లో గృహ రుణాలు తీసుకున్న మధ్యతరగతి ప్రజలకు భారీ à°Šà°°à°Ÿ కల్పించారు. గృణ రుణాల వడ్డీలపై పన్ను రాయితీని ఏడాదికి రూ.2 లక్షల నుంచి రూ.3.5 లక్షలకు పెంచారు. ప్రస్తుతం సొంతంగా ఉండే ఇంటికి రూ. 2లక్షలు వడ్డీ రాయితీ ఉంది. తొలిసారి ఇల్లు కొంటున్న వాళ్లకు మరో రూ. 50వేల వడ్డీ రాయితీ ఉంది. à°ˆ రాయితీ కావాలంటే ఇంటి ధర రూ. 50లక్షల లోపు ఉండాలి. రూ. 35లక్షలలోపు రుణం తీసుకొని ఉండాలి. తాజాగా మార్చి 2020లోపు తీసుకున్న గృహ రుణాలకు వడ్డీ రాయితీని రూ. 3.5లక్షలకు పెంచారు. à°ˆ రాయితీ పొందేందుకు ఇంటి ధర రూ. 45లక్షల్లోపు ఉండాలి. à°ˆ పథకం à°•à°¿à°‚à°¦ ఈఎంఐలు పూర్తయ్యే సరికి గరిష్ఠంగా రూ. 7లక్షలు లబ్ధి పొందుతారని అంచనా. మరోపక్క ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్‌ యోజన సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తుండటంతో ఇళ్ల నిర్మాణం శరవేగంగా పూర్తవుతోంది. 2015-16 సంవత్సరంలో 314 రోజుల్లో ఇల్లు కడితే ఇప్పుడు 114 రోజుల్లోనే పూర్తి చేస్తున్నారు. వచ్చే మూడేళ్లలో 1.95 కోట్ల ఇళ్లు నిర్మితమవుతాయని అంచనా.
రెంటల్‌ యాక్ట్‌కు సవరణ
వలస కార్మికుల కోసం, విద్యార్థుల కోసం భారీ ఎత్తున అద్దె గృహ సముదాయాలను నిర్మించాలనుకుంటున్న ప్రభుత్వం , అందుకోసం రెంటల్‌ యాక్ట్‌ను సవరించాలని యోచిస్తోంది. ప్రస్తుత అద్దె చట్టం చాలా పాతది. అద్దెల కోసం ఇల్లు నిర్మించడం ఏ మాత్రం లాభదాయకం కాని వ్యవహారంగా కార్పొరేట్లు భావిస్తున్నాయి. à°ˆ పరిస్థితిని మార్చేందుకే ప్రభుత్వం మోడల్‌ రెంటల్‌ యాక్ట్‌ను తీసుకురానుంది.