సర్జరీ సమయంలో కడుపులో దూది పెట్టి కుట్లేసిన డాక్టర్లు

Published: Monday July 08, 2019
మూడునెలల క్రితం ప్రసవం కోసం వచ్చిన à°“ మహిళ పట్ల వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. బిడ్డ అడ్డం తిరిగాడని.. ఆపరేషన్‌ చేసి బిడ్డను తీయాలంటూ వైద్యులు సూచించడంతో ఆమహిళ బంధువులు ఆపరేషన్‌కు ఒప్పుకున్నారు. అయితే ఆపరేషన్‌ సమయంలో డాక్టర్లు నిర్లక్ష్యంగా పేగులో కాటన్‌ (దూది)తో పాటు మరో ఇనుప వస్తువు పెట్టి కుట్లు వేయడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారిందంటూ ఆమె బంధువులు ఆదివారం సాయంత్రం à°•à°¡à°ª ఎర్రముక్కపల్లెలోని ప్రైవేటు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
 
ఆమె బంధువుల వివరాల మేరకు.. రాయచోటికి చెందిన à°¡à°¿.కవిత à°—à°¤ ఏప్రిల్‌ నెలలో డెలివరీ కోసం ఎర్రముక్కపల్లెలోని ప్రైవేటు ఆసుపత్రికి వచ్చింది. ఆసుపత్రి వైద్యులు ఆమెకు ఆపరేషన్‌ చేసి బిడ్డను తీశారు. à°† సమయంలో డాక్టర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆమె పేగుల్లో కాటన్‌తో పాటు ఆపరేషన్‌కు ఉపయోగించే à°“ ఇనుప వస్తువును కడుపులోనే పెట్టి కుట్లు వేసి పంపించారని ఆరోపించారు.
 
అయితే నెల క్రితం కడుపు నొప్పి రావడంతో తిరిగి ఆసుపత్రిలోనే వైద్యులకు చూపించడంతో ఇన్‌ఫెక్షన్‌ వచ్చి ఉంటుందని, అందుకు సంబంధించిన మందులు వాడాలని సూచించడంతో వారు మందులు తీసుకుని తిరిగి వెళ్లారు. నొప్పి తీవ్రం కావడంతో మూడురోజుల క్రితం అదే ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చి చేరింది.
 
అయితే ఆమె పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో వైద్యులు సూచనల మేరకు రక్తపరీక్షతో పాటు స్కానింగ్‌, ఎక్స్‌రే తీసుకోవడంతో కడుపులోని పేగుల్లో కాటన్‌తో పాటు ఇనుప వస్తువు పెట్టి కుట్లు వేశారంటూ వారు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న వన్‌టౌన్‌ సీఐ చంద్రశేఖర్‌ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులకు సర్ది చెప్పారు. మెరుగైన వైద్యం కోసం కవితను వేలూరు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ వైద్యులపై à°•à° à°¿à°¨ చర్యలు తీసుకోవాలని ఆమె బంధువులు డిమాండ్‌ చేశారు. అయితే సీఐ సర్ధి చెప్పడంతో వారు అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. కాగా ఆసుపత్రిపై కవిత బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.