టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ

Published: Monday July 08, 2019
 à°¸à±‹à°‚పేట మండలం పలాసపురంలో ఆదివారం టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గ్రామంలో à°“ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్తున్న ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ను అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు ప్రయత్నించారు. ఐదేళ్లలో ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదంటూ విమర్శించారు. కాగా, ఐదేళ్లలో నియోజకవర్గాన్ని తామెంతో అభివృద్ధి చేశామని టీడీపీ శ్రేణులు బదులిచ్చారు. à°ˆ క్రమంలో ఇరువర్గాల మాటల యుద్ధం రాజుకుంది. అది ఘర్షణకు దారితీసింది. అందులో భాగంగా టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు రాళ్లు, చెప్పులు విసరడంతో ఉద్రిక్తత నెలకొంది.
 
పలాసపురంలో పంచాయతీ కార్యాలయం, అంగన్‌వాడీ నూతన భనవం, పాఠశాలలోని డిజిటల్‌ గదిని ఎమ్మెల్యే అశోక్‌తో ఆదివారం ప్రారంభించేందుకు టీడీపీ నాయకులు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా శిలాఫలకాలు సిద్ధం చేశారు. వీటిని గుర్తుతెలియని వ్యక్తులు శనివారం రాత్రి ధ్వంసం చేశారు. ఆదివారం ఉదయం దీనిని గుర్తించిన టీడీపీ నాయకులు అక్కడ గుమిగూడారు. ఇంతలో ఎమ్మెల్యే అశోక్‌ పలాసపురం చేరుకున్నారు. ముందు పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రం భవనాన్ని ప్రారంభించేందుకు వెళ్తుండగా స్థానిక వైసీపీ కార్యకర్తలు ఆయనను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఐదేళ్లలో ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని కొందరు కేకలు వేశారు. ఈక్రమంలో ఎమ్మెల్యేను వెనక్కి నెట్టేశారు. వీరిని తోసుకుంటూ ప్రారంభోత్సవం కోసం ఎమ్మెల్యే లోపలకు వెళ్లిపోయారు. ఇదే సమయంలో వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలపై రాళ్లు, చెప్పులు విసిరి గందరగోళం సృష్టించారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాటకు దారితీసింది. విషయం తెలుసుకున్న సోంపేట ఎస్‌ఐ కే.వెంకటేష్‌ సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.