ఉన్నవాళ్లను తొలగించి కొత్తవారిని తీసుకోవడమే ఉద్యోగ కల్పనా

Published: Tuesday July 09, 2019
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ప్రజాపంపిణీలో కీలకంగా వ్యవహరిస్తున్న డీలర్లను తొలగిస్తే ఉద్యమం తప్పదని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు. గుంటూరులో సోమవారం మరో మాజీ మంత్రి జవహర్‌తో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంటికే రేషన్‌ అందిస్తామనటాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అయితే 29,500 డీలర్ల సంగతి ఏంట ని ప్రశ్నించారు. వారికి అన్యాయం జరిగితే ఉపేక్షించేది లేదన్నారు. వారి కృషితో ప్రజాపంపిణీలో దేశానికి ఏపీ ఆదర్శంగా నిలిచిందన్నారు. రూ.1000à°—à°¾ ఉన్న పింఛన్లను రూ.2,250 చేశానని జగన్‌ అనటాన్ని ఆయన తప్పు పట్టారు. వైఎస్‌ జయంతి నాడైనా జగన్‌ నిజాలు మాట్లాడితే బాగుండేదని ఎద్దేవా చేశారు. 5నెలల నుంచి లబ్ధిదారులకు ఎన్టీఆర్‌ ఆసరా పథకం à°•à°¿à°‚à°¦ రూ.2000 ఇస్తున్నట్లు తెలిపారు.
 
 
ఏళ్ల తరబడి విధులు నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులను, ఉపాధి ఫిల్డ్‌ అసిస్టెంట్లను తొలగించటాన్ని ఆయన తప్పుపట్టారు. ఉన్నవారిని తొలగించి కొత్తవారిని నియమించటమే ఉద్యోగకల్పనా? అని నిలిదీశారు. ‘ప్రభుత్వ నిర్ణయాలన్నీ అనుమానాలకు దారి తీస్తున్నాయి. అమ్మ ఒడిపై స్పష్టత ఇవ్వాలి’ అని జవహర్‌ డిమాండ్‌ చేశారు. ఎన్నికల సమయంలో à°’à°•à°°à°•à°‚à°—à°¾... మేనిఫెస్టోలో మరోరకంగా హామీలిచ్చి ప్రజలను మోసం చేశారని అధికార ప్రతినిధి యామిని శర్మ విమర్శించారు. వైసీపీ మైండ్‌ గేమ్‌తో అధికారంలోకి వచ్చిందనీ, ఇప్పుడు ఎన్నికలు జరిపినా టీడీపీ అధికారంలోకి వస్తుందని సినీనటి దివ్యవాణి ధీమా వ్యక్తం చేశా