ఏపీలో టీడీపీ ఖాళీ

Published: Saturday July 13, 2019
 à°—à°¤ ప్రభుత్వ అవినీతిని బహిర్గతం చేసి అందుకు కారణమైన అధికారులు, ప్రజా ప్రతినిధులపై చర్యలు చేపట్టాలని మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర సభ్యత్వ ప్రముఖ్‌ పైడికొండల మాణిక్యాలరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 2024 నాటికి రాష్ట్రంలో అధికారం సాగించే దిశగా పార్టీని బలోపేతం చేస్తున్నామని తెలిపారు. బీజేపీ అధిష్టానం ఆదేశాల కోసం వేచి చూస్తున్నామని ఓకే అంటే రాష్ట్రంలో టీడీపీ ఖాళీ అవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎనిమిరెడ్డి మాలకొండయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభ్యత్వ నమోదు దిశా నిర్దేశం కార్యక్రమంలో మాణిక్యాలరావు ముఖ్యఅతిథిగా పాల్గొని సభ్యత్వ నమోదుపై సమీక్షించారు. à°ˆ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఆగస్టు 11 వరకు నిర్వహించే సభ్యత్వ నమోదు కార్యక్రమంలో 20 లక్షల సభ్యత్వాలు చేయించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. బీజేపీ 11 కోట్ల సభ్యత్వాలతో ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా గుర్తింపు పొందిందని దీనిని 15 కోట్లకు చేర్చే లక్ష్యంతో సభ్యత్వ అభియాన్‌ కార్యక్రమం అఖిలభారత కన్వీనర్‌ శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ నేతృత్వంలో కొనసాగుతోందని అన్నారు. జగన్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఆశాజనకంగా లేదని à°•à°‚à°Ÿà°¿ తుడుపు బడ్జెట్‌à°—à°¾ ఉన్న విమర్శించారు.
 
విపక్షనేతగా టీడీపీ ప్రభుత్వంపై అనేక అవినీతి ఆరోపణలు చేసిన జగన్‌ ముఖ్యమంత్రిగా à°—à°¤ ప్రభుత్వ అవినీతిని వెలికితీసి చర్యలు తీసుకోగలిగే పరిస్థితి ఉందా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో కరువ పరిస్థితులు నెలకొన్నాయని ఉత్తరాంధ్ర, రాయలసీమ, తదితర జిల్లాల ప్రజలు వలసపోతున్నారని, నీటి ఎద్దడి, కరువు నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. ధాన్యం కొనుగోలులో రైతులకు అన్యాయం జరిగిందని, దానిని సవరించాలని ప్రభుత్వాన్ని కోరారు. టీడీపీ నుంచి పలువురు ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు బీజేపీ వైపు చూస్తున్నారని, అధిష్టానం ఓకే అంటే భారీగా చేరికలు ఉంటా యన్నారు. రాష్ట్రంలో ప్రజల పక్షం వహించి ప్రభుత్వం ప్రజాహిత నిర్ణయాలు తీసుకుంటే మద్దతు ఇస్తామని ప్రజావ్యతిరేక నిర్ణయాలు, అవినీతిపై ప్రభుత్వంతో పోరాడతామన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి రేలంగి శ్రీదేవి, యువమోర్చా జిల్లా అధ్యక్షుడు ఆకుల శ్రీధర్‌, మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి పన్నాల వెంకటలక్ష్మి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రాల వెంకటరావు, అసెంబ్లీ కన్వీనర్‌ వంటెద్దు స్వామి, కర్రి నాగిరెడ్డి, కోన సతీష్‌, రొంగల గోపి, కందుకూరి మనోజ్‌ పాల్గొన్నారు.