బంగాళాఖాతంలో బలహీనంగా ‘నైరుతి’

Published: Monday July 15, 2019
నైరుతి రుతుపవనాల సీజన్‌ మొదలై నెల దాటుతున్నా ఇంకా వర్షాల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. ఇప్పటికీ పలుచోట్ల 40డిగ్రీలకు పైబడి పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జోరుగా వర్షాలు కురిసి వాతావరణం చల్లబడాల్సిన తరుణంలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ వేసవిని తలపించేలా ఎండలు కాస్తున్నాయి. కనీస స్థాయిలో కూడా వాన కురవకపోవడంతో చాలాప్రాంతాల్లో ఇప్పటికీ వరి నారుమడులు పోయలేదు. గతనెలలో చెదురుమదురుగా కురిసిన వర్షాలకు అక్కడక్కడా వేసిన అపరాలు, చిరుధాన్యాలు వంటి మెట్ట పంటలు, తరువాత వర్షాలు లేకపోవడంతో ఎండిపోతున్నాయి. రుతుపవనాలు ప్రవేశించి నెలకుపైగా అయినా అడపాదడపా తప్ప జడివాన జాడలేదు. సాధారణంగా నైరుతి ప్రవేశించిన తరువాత ముసురు వాతావరణం నెలకొనాలి.
 
అయితే à°ˆ ఏడాది ఎండకాలం మాదిరిగా ఉరుములతో వర్షాలు కురుస్తున్నాయి. శనివారం కోస్తాలో à°Žà°‚à°¡ తీవ్రతకు మేఘాలు ఆవరించి వర్షాలు కురిశాయి. రుతుపవనాల ప్రవేశం తరువాత బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు ఏర్పడాలి. అప్పుడే తూర్పుభారతం మీదుగా మధ్యభారతం, అక్కడినుంచి వాయవ్య రాష్ట్రాల వరకు వర్షాలు కురవాలి. ఇదే సమయంలో కోస్తా, తెలంగాణలో భారీవర్షాలు నమోదవుతుంటాయి. à°ˆ సీజన్‌లో బంగాళాఖాతంలో ఇప్పటివరకు ఆరేడు అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడాల్సి ఉంది. కానీ, ప్రస్తుతం బంగాళాఖాతంలో అందుకు అనువైన వాతావరణం కనిపించడం లేదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో అల్పపీడనాలు ఏర్పడితేనే నైరుతి సీజన్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది.