ఏపీఐఐసీ సంస్థ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన రోజా

Published: Tuesday July 16, 2019
 ‘దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి స్ఫూర్తితో ఎలాంటి అవకతవకలు, అవినీతికి తావులేకుండా ఏపీఐఐసీ సంస్థను పారదర్శకంగా, ప్రగతి పథంలో నడిపిస్తా. పెట్టుబడులు, ఉద్యోగాల విషయంలో à°—à°¤ టీడీపీ ప్రభుత్వం దొంగ లెక్కలు చూపి అబద్ధాలతో మోసం చేసింది’ అని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఆటోనగర్‌లోని ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (ఏపీఐఐసీ) ప్రధాన కార్యాలయంలో సంస్థ చైర్‌పర్సన్‌à°—à°¾ సోమవారం మధ్యాహ్నం ఆమె బాధ్యతలు చేపట్టారు.
 
అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగం అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలను ఎక్కువగా ప్రోత్సహిస్తానన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ప్రాధాన్యమిస్తానని చెప్పారు. కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధి బాగా జరిగేదన్నారు. హోదా విషయంలో కేంద్రం మాట తప్పిందన్నారు. స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే పరిశ్రమలకు అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు.