అక్రమమని తెలిసీ అక్కడే ఉంటారా

Published: Friday July 19, 2019

ప్రతిపక్ష నేత చంద్రబాబుకు బుర్ర, జ్ఞానం ఉందా అంటూ ముఖ్యమంత్రి జగన్‌ సభలో మండిపడ్డారు. ప్రజావేదిక కూల్చవద్దంటూ చంద్రబాబు కోర్టుకెళ్లారని, కోర్టు కూడా కూల్చివేతను సమర్థించిందని తెలిపారు. ప్రస్తుతం తాను నివాసం ఉంటున్న ఇంట్లో స్విమ్మింగ్‌ ఫూల్‌ నిర్మాణానికి 2007 రివర్‌ కన్జర్వేటర్‌ అనుమతిచ్చారని చంద్రబాబు సభలో చెప్పారు. దీనిపై స్పందించిన సీఎం భవనానికి, స్విమ్మింగ్‌ఫూల్‌à°•à°¿ ఒకే నిబంధనలు ఎలా వర్తిస్తాయని ప్రశ్నించారు. ‘‘à°ˆ స్థాయి వ్యక్తి తాను అక్రమ భవనంలోనే ఉంటానని, ఏం చేసుకుంటారో చేసుకోండనే రీతిలో వ్యవహరిస్తున్నారు. ఆయనకు బుర్ర, జ్ఞానం ఉన్నాయా!’’ అని విమర్శించారు. క్రమబద్ధీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రైవేటు భవనాలకే వర్తిస్తుందన్నారు. ‘‘ప్రజావేదిక భవనాన్ని అక్రమంగా కట్టారు. చట్టాలను ఉల్లంఘించి కట్టిన దాన్ని తొలగిస్తే దానిపై ప్రత్యేకంగా చర్చ ఎందుకు? వివిధ రాష్ట్రాల్లో వరదలు వచ్చి ఇళ్లు కూలిపోవడం చూస్తున్నాం. ఇలాంటి నిర్మాణాల వల్ల నీటి ప్రవాహం మరో మార్గంలో ప్రవహిస్తుంది. వేరేప్రాంతం ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. ప్రజావేదిక నిర్మాణానికి విజయవాడలోని రివర్‌ కన్జర్వేటర్‌ అనుమతి నిరాకరించారు. అయినా... నేనే ముఖ్యమంత్రిని ఎవరాపుతారులే అన్న ధీమాతో చంద్రబాబు అక్రమంగా నిర్మించారు’’ అని జగన్‌ మండిపడ్డారు.