సచివాలయంలో జాబ్‌ అంటూ మోసం

Published: Friday July 19, 2019

సచివాలయంలో ఉద్యోగాలిప్పిస్తామని నిరుద్యోగుల నుంచి రూ.13.70 లక్షలు వసూలు చేసిన ముఠా పోలీసులకు పట్టుబడింది. à°† వివరాలను తుళ్లూరు సీఐ విజయకృష్ణ గురువారం వెల్లడించారు. నంద్యాలకు చెందిన శివనాగార్జునరెడ్డి, అతని స్నేహితులు సతీ్‌షకుమార్‌, రెడ్డి గౌతమ్‌, మిధున్‌ చక్రవర్తి ముఠాగా ఏర్పడ్డారు. కర్నూలు జిల్లా సిరివెళ్ల గ్రామానికి చెందిన చాకలి మనోహర్‌ను సచివాలయంలోని సోషల్‌ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంటులో సబార్డినేట్‌ పోస్టు ఇప్పిస్తామని à°ˆ ముఠా నమ్మించింది. అందుకు రూ.3,80,000 చెల్లించాలని ఒప్పందం చేసుకున్నారు. అడ్వాన్స్‌à°—à°¾ రూ.30 వేలు తీసుకున్నారు. సోషల్‌ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంటు స్టాంప్‌, సెక్రటరీ రవిచంద్ర డిజిటల్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసి నియామక పత్రాన్ని బాధితుడికి వాట్సాప్‌ చేశారు. వెంటనే మిగిలిన డబ్బులు చెల్లించాలని కోరారు. బాధితుడు మనోహర్‌ సచివాయానికి వచ్చి సరిచూసుకోగా అది తప్పుడు కాపీ అని తేలింది. దీంతో మోసపోయానని గ్రహించిన మనోహర్‌ తుళ్లూరు పోలీసులను ఆశ్రయించడంతో à°ˆ ముఠా గుట్టు రట్టయింది. నిందుతులను అరెస్టు చేసి విచారించగా.. నేరం అంగీకరించారు. ఇలా ఉద్యోగాలిప్పిస్తామని మరో ఏడుగురి నుంచి రూ.13.70 లక్షల వసూలు చేసినట్టు à°ˆ ముఠా పోలీసులకు తెలిపింది.