ప్రకాశంలో పొంగి పొర్లుతున్న వాగులు

Published: Sunday July 21, 2019
ఛత్తీస్‌గఢ్‌ పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శనివారం కోస్తాలో అనేక చోట్ల, రాయలసీమలో అక్కడక్క à°¡à°¾ వర్షాలు కురిశాయి. జంగారెడ్డిగూడెంలో 7, భీమడోలు, దేవీపట్నంలో 6, ఆకివీడు, పంగిడిగూడెంలో 5సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే, రుతుపవన ద్రోణి ప్రస్తుతం యథాస్థానంలోనే కొనసాగుతున్నందున దక్షిణాది, దానికి ఆనుకుని మధ్యభారతంలో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ అధికారి ఒకరు తెలిపారు. దీనికితోడు ఉపరితల ఆవర్తనం ఛత్తీ్‌సగఢ్‌లో కొనసాగుతున్నందున రానున్న 3, 4రోజుల్లో తెలంగాణ, కోస్తాల్లో వర్షాలకు అవకాశం ఉందన్నారు. ప్రకాశంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు ప్రజలకు ఊరటనిచ్చాయి. సగటున 5.80సెం.మీ వర్షపాతం నమోదైంది. శుక్రవారం రాత్రి పర్చూరు మండలంలో అత్యధికంగా 17.97సెం.మీ, చినగంజాం మండలంలో 12.80, యద్దనపూడిలో 10.52, ఇంకొల్లులో 7.12 పంగులూరులో 7.02, సంతమాగులూరులో 7.02సెం.మీ వర్షం కురిసింది. పర్చూ రులో వాగులు, వంకలు, ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
 
ఐదేళ్లుగా చుక్క నీరు లేని పర్చూరు వాగు ఈ వర్షాలకు పొంగి దాదాపు పదికిపైగా కాలనీలు జలమయమయ్యాయి. నక్కలవాగు పొంగి యద్దనపూడి-యనమదల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పూనూరు చుట్టూ ఉన్న వాగులు ఉధృతికి గ్రామంలోకి వెళ్లేందుకు వీలులేకుండా పోయింది. చీరా లలో భారీవర్షం కురిసింది. పశ్చిమగోదావరి జిల్లాలో శనివారం గంటసేపు కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. డెల్టా మండలాల్లో వరినారుమళ్లు ముంపునకు గురయ్యాయి. ఏలూరు, భీమవరం, పాలకొల్లు, జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెం, నరసాపురం, కొవ్వూరు, పోలవరం, తణుకు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది.