జన్మభూమి కమిటీల జిరాక్సే గ్రామ వలంటీర్లు

Published: Monday July 22, 2019
జన్మభూమి కమిటీల పేరుతో చంద్రబాబు అమలు చేసిన వ్యవస్థనే గ్రామ వలంటీర్ల రూపంలో సీఎం జగన్‌ తీసుకొస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. గుంటూరుజిల్లా తెనాలిలో ఆదివారం బీజేపీ సభ్యత్వం స్వీకరించేందుకు వచ్చిన వారితో నిర్వహించిన సంఘటన పర్వ్‌-2019 కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ టీడీపీకి, వైసీపీకి తేడా లేకుండా పోతోందన్నారు. ‘పేరే మారింది. చంద్రబాబు చేసిందే జగన్‌ అనుసరిస్తున్నారు’ అన్నారు. రాష్ట్ర కో-ఇన్‌చార్జి సునీల్‌ దేవ్‌ధర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో కులం ప్రభావం గణనీయంగా ఉందన్నారు. కోర్లు ఖర్చుపెట్టి గెలిచిన వారు రెండుమూడు రెట్లు సంపాదించుకుంటున్నారని చెప్పారు. మహిళా మోర్చా జాతీయ ఇన్‌చార్జి దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ ప్రత్యేక హోదా ముగిసిన అధ్యయనం అని కేంద్రం చెబుతున్నా, వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడం ప్రజలను మభ్యపెట్టడమేనన్నారు.
 
 
గోదావరి జలాలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు. కర్నూలు జిల్లా కల్లూరు మండలంలో చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేశ్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామ వలంటీర్ల నియామకం జన్మభూమి కమిటీల జిరాక్సేనని అన్నారు. à°•à°¡à°ª జిల్లా రాయచోటిలో బీజేపీ జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్‌ మాట్లాడుతూ కుల, వారసత్వ రాజకీయాలకు నిలయంగా మారిన టీడీపీ, వైసీపీలకు చరమగీతం పాడిన రోజే రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి లోకల్‌ లీడర్‌ కావున బీజేపీ డోర్‌ ఓపెన్‌లో ఉందన్నారు.