పెనం మీద దోశ తిప్పినంత తేలిగ్గా జగన్‌ మాట మార్చారు

Published: Wednesday July 24, 2019

నలభై ఆరే ళ్ల జగన్‌కు ఉద్యోగం వచ్చింది గానీ.. నలభై ఐదేళ్ల పె న్షన్‌ రత్నం మాత్రం మాయమైంది’ అని టీడీపీ జా తీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ఎద్దేవాచేశారు. 45 ఏళ్లకే పెన్షన్‌ హామీ తమ మేనిఫెస్టోలో లేదంటూ అసెంబ్లీలో సీఎం, మంత్రులు చేసిన ప్రకటనపై à°† యన మంగళవారం ట్విటర్‌లో స్పందించారు. ‘పాదయాత్రలో గుర్తొచ్చిన ప్రజల కాళ్ల నొప్పులు మీరు కుర్చీ ఎక్కిన వెంటనే మరచిపోయారా? బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు 45 ఏళ్లకే పింఛను అన్న మీరు ఇప్పుడు పెనం మీద దోశ తిప్పినంత తేలిగ్గా మాట మార్చి వారిని మోసం చేశారు. ఆయన మడమ తిప్పడం, మాట మార్చడం వల్ల ఒక్కో మహిళకు రూ.45 వేలు నష్టం జరుగుతోంది’ అని పేర్కొన్నారు. మరో ట్వీట్‌లో ‘మూర్ఖత్వం అసలు పేరు.. అహంభావం ముద్దు పేరు అనే వాడుక జగన్‌ గారిని చూస్తుంటే అక్షరాలా నిజం అనిపిస్తోంది’ అని వ్యాఖ్యానించారు. ‘విద్యుత్‌ ఒప్పందాలు పారదర్శకంగానే జరిగాయని, సమీక్ష వద్దని కేంద్రం, మేధావులు చెప్పినా ఆయన చెవికి ఎక్కలేదు. à°“ కమిటీ వేసి ఏదో చేసేద్దామని, అవినీతి నిరూపించాలని కసిగా ఉన్నారు. జగన్‌ గారూ! మీ కసి నాకు నచ్చింది. కానీ కేంద్ర సంస్థ ఎన్టీపీసీ వాళ్లకు నచ్చలేదనుకుంటాను. అందుకే à°’à°• లేఖ రాశారు. ఏమిటో... మీ కసిని ఎవరూ అర్థం చేసుకోవడం లేదు’ అన్నారు