అమాయకులు కేసుల్లో ఇరుక్కొంటున్నారు

Published: Thursday July 25, 2019
 à°ªà±à°°à°­à±à°¤à±à°µà°¾à°¨à±à°¨à°¿ విమర్శిస్తే దేశాన్ని విమర్శిస్తున్నట్లు చిత్రీకరించడం మంచిది కాదు. దేశాన్ని ప్రేమిస్తున్న వారికి ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఉంది. దేశానికి మంచి చేసే విమర్శలను స్వీకరించాలి’’ అని టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. బుధవారం లోక్‌సభలో ‘చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్ట సవరణ బిల్లు’ (యూఏపీఏ)పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. యూఏపీఏ à°•à°¿à°‚à°¦ 75 కేసులు 2015లో నమోదైతే వాటిలో 65 కేసుల్లోనూ, 2016లో 67 శాతం కేసుల్లోనూ నిందితులు నిర్దోషులుగా తేలారని వివరించారు. 50 శాతం పైగా కేసుల్లో నిందితులు నిర్దోషులుగా విడుదలవ్వడం ఆందోళనకరమన్నారు. కేసుల్లో ఇరుక్కొని విడుదలైన అమాయకులైన వారికి ప్రభుత్వం పునరావాసం, పరిహారం అందించే చర్యలు చేపట్టాలని సూచించారు.
 
 
టెర్రరిస్టుగా తేలినవారి ఆస్తుల జప్తునకు రాష్ట్ర డీజీపీ అనుమతి లేకుండా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) డీజీకి అనుమతులిస్తున్న నేపథ్యంలో ఎన్‌ఐఏ పనితీరులో పాదర్శకత ఉండాలని సూచించారు. ఎన్‌ఐఏపై ప్రత్యేక పర్యవేక్షణ యంత్రాంగం ఉండాలని ప్రతిపాదించారు. జైళ్లలో, కేసుల్లోనూ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలే ఎక్కువగా ఉంటున్నారని, à°ˆ పరిస్థితిని మార్చడానికి ఆయా వర్గాల కమిషన్లతో సమీక్షించాలని కోరారు. à°ˆ చట్టం దుర్వినియోగం కాకుండా చూడాలని రామ్మోహన్‌ నాయుడు విజ్ఞప్తి చేశారు.