108 రాక మార్గమధ్యలో ప్రసవాలు

Published: Friday July 26, 2019
నిండు గర్భిణులు.... నొప్పులు తీవ్రమయ్యాయి... కుటుంబ సభ్యులు వెంటనే 108 వాహనానికి ఫోన్లు చేశారు. వారు సమ్మెలో ఉండటంతో ఏ స్పందనా రాలేదు. దీంతో ప్రైవేటు వాహనాలను రప్పించి ఆస్పత్రికి తరలిస్తుండగా ఆ వాహనాలలోనే మహిళలు ప్రసవించారు. కర్నూలు, కృష్ణాజిల్లాల్లో గురువారం ఈ సంఘటనలు చోటుచేసుకున్నాయి. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కారుమంచికి చెందిన శిరీషకు నొప్పులు అధికం కావడంతో 18 కిలోమీటర్ల దూరంలోని ఎమ్మిగనూరు తీసుకువెళ్లడానికి ఆటో మాట్లాడారు. పట్టణానికి వెళ్లాక నొప్పులు తీవ్రం కావడంతో కుటుంబ సభ్యులు ఆటోలోనే కాన్పు చేసి, తల్లీబిడ్డలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
 
అలాగే కృష్ణాజిల్లా మోపిదేవి మండలం కొక్కిలిగడ్డకు చెందిన గుంటూరు గంగమ్మకు గురువారం ఉదయం పురిటినొప్పులు వచ్చాయి. కుటుంబసభ్యులు 108à°•à°¿ ఫోన్‌చేసినా ఫలితం లేకపోయింది. మోపిదేవి నుంచి ఐదుకిలోమీటర్ల దూరం ఉన్న కొక్కిలిగడ్డకు ట్యాక్సీ తీసుకు వచ్చి, చల్లపల్లి వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో ఆడబిడ్డకు జన్మనిచ్చినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. వెంటనే చల్లపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లగా, వైద్యులు పరీక్షలు నిర్వహించి తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్టు తెలిపారు.