నాది కూడా సిద్ధార్థ పరిస్థితే...

Published: Wednesday July 31, 2019
కేఫ్ కాఫీడే వ్యవస్థాపకుడు, కర్నాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్ధార్థ ఆత్మహత్యపై ప్రముఖ లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యా స్పందించారు. తనది కూడా సిద్ధార్థ పరిస్థితేనంటూ ట్విటర్లో సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
‘‘వీజీ సిద్ధార్థకు నాకు పరోక్ష సంబంధం ఉంది. ఆయన అద్భుతమైన మనిషి. ప్రజ్ఞావంతుడైన పారిశ్రామికవేత్త. ఆయన లేఖలో పేర్కొన్న విషయాలు నన్ను కలచివేశాయి. బ్యాంకులు, విచారణ సంస్థలు ఎలాంటి వ్యక్తినైనా నిస్పృహలోకి నెట్టగలవు. అప్పులు పూర్తిగా చెల్లిస్తానని నేను ముందుకొచ్చినప్పటికీ నా విషయంలో à°Žà°‚à°¤ దారుణంగా, దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో చూడండి...’’ అని మాల్యా ట్వీట్ చేశారు.
ప్రజ్ఞావంతుడైన పారిశ్రామికవేత్త. ఆయన లేఖలో పేర్కొన్న విషయాలు నన్ను కలచివేశాయి. బ్యాంకులు, విచారణ సంస్థలు ఎలాంటి వ్యక్తినైనా నిస్పృహలోకి నెట్టగలవు. అప్పులు పూర్తిగా చెల్లిస్తానని నేను ముందుకొచ్చినప్పటికీ నా విషయంలో à°Žà°‚à°¤ దారుణంగా, దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో చూడండి...’’ అని మాల్యా ట్వీట్ చేశారు.
 
పాశ్చాత్య దేశాల్లో ప్రభుత్వాలు, బ్యాంకులు రుణ గ్రహీతలు తమ అప్పులు తిరిగి చెల్లించేలా సాయం చేస్తారనీ... కానీ తన విషయంలో దీనికి పూర్తికి భిన్నంగా జరుగుతోందని మాల్యా ఆరోపించారు. ‘‘పాశ్చాత్య దేశాల్లో ప్రభుత్వాలు, బ్యాంకులు రుణ గ్రహీతలకు అప్పు చెల్లించడంలో సాయం చేస్తాయి. కానీ నా విషయంలో మాత్రం, à°“ వైపు నా ఆస్తులను జప్తు చేసేందుకు పోటీపడుతూనే మరోవైపు నేను అప్పు చెల్లించేందుకు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని అడ్డుకుంటున్నారు...’’ అని ఆయన పేర్కొన్నారు. à°­à°¾à°°à°¤ బ్యాంకులకు రూ.9 వేల కోట్ల మేర రుణాలు ఎగవేసిన కేసులో విజయ్ మాల్యాపై ఈడీ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే.
 
ఆదాయపన్ను అధికారుల వేధింపుల కారణంగానే తాను తనువుచాలిస్తున్నట్టు సిద్ధార్థ సూసైడ్ నోట్‌లో ఆరోపించిన సంగతి తెలిసిందే. మైండ్‌ట్రీ కంపెనీకి సంబంధించి పన్ను చెల్లింపుల్లో అక్రమాలు జరిగాయంటూ ఆదాయపన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నుంచి సిద్ధార్థ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే సవరించిన రిటర్నులను దాఖలు చేసినప్పటికీ తమ మైండ్‌ట్రీ ఒప్పందాన్ని అడ్డుకునేందుకు రెండు సార్లు తమ షేర్లు అటాచ్ చేయడం, à°† తర్వాత కాఫీ డే షేర్లను స్వాధీనం చేసుకోవడం వంటి చర్యలతో ఐటీ శాఖ తనను వేధించినట్టు సిద్ధార్థ తన లేఖలో ఆరోపించారు.