మద్యనిషేధం కుదరదని జగన్‌కూ తెలుసు

Published: Thursday August 01, 2019
ఎన్నికల ముందు వృద్ధుల కు రూ.3 వేల పెన్షన్‌ ఇస్తామని హామీ ఇచ్చిన వైసీపీ.. తీరా గెలిచా à°• రూ.2,250 చేతిలో పెట్టి అంచెలంచెలుగా పెంచుతామని మాట మార్చిందని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. మద్యపానాన్ని అంచెలంచెలుగా నిషేధిస్తామని సీఎం జగన్‌ ప్రకటించారని.. కానీ అది జరగదని ఆయనతో పాటు అందరికీ తెలుస ని చెప్పారు. మాయ మాటలు, మోసపూరిత వాగ్దానాలతో అందలమెక్కాలని కలలో కూడా తాను అనుకోలేదన్నారు. బుధవారం మం గళగిరి కార్యాలయంలో రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ‘బాధ్యతతో కూడిన లిక్కర్‌ పా లసీ తీసుకొస్తామని జనసేన చెప్పింది. 70 శాతం మహిళలు కోరుకుంటేనే లిక్కర్‌ షాపులు తొలగిస్తామని చెప్పాం’ అని గుర్తుచేశారు.
 
జనసేన పార్టీ నిర్మాణం ఓటమి à°¤ ర్వాతనే మొదలైందన్నారు. ‘నాయకుడంటే 360 డిగ్రీల్లో ఆలోచించాలి. ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఎన్ని ఎదురుదెబ్బలు తినడానికైనా సిద్ధంగా ఉండాలి. ఇవేమీ చేయకుండా ఎన్నికలకు ఐదు నె లల ముందు పార్టీలోకివ చ్చి నన్ను ప్రభావితం చే యాలని చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయండంటే గ్రూపులు కట్టారు. అప్పుడే నాకు ఓటమి కనిపించింది. కేవలం నాయకత్వ లోపంతోనే ఓడిపోయాం’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో అనుకున్నది సాధించలేకపోయామని, ఇప్పటికైనా అందరూ మే ల్కొని పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. జనసేనకు ప్రభుత్వాన్ని స్థాపించే శక్తి ఉందో లేదో తెలియదని, కానీ మనతో గొడవ పెట్టుకున్న వారిని ప్రభుత్వంలోకి రాకుండా చేయగలిగే శక్తి మాత్రం ఉందని చెప్పారు.
 
 
పవన్‌ రోడ్ల మీద తిరిగితే పార్టీ బలపడుతుందని సలహాలు ఇస్తున్నారని.. ప్రధాని మోదీ, చంద్రబాబు, లోకేశ్‌ రోడ్లపై తిరగరని.. జగన్మోహన్‌రెడ్డి మీద కేసులు లేకపోతే ఆయనా జనంలో తిరిగేవారు కాదని జనసేనాని తెలిపారు. ‘నేను కూడా రోడ్లపై తిరిగేందుకు సిద్ధం. కానీ అభిమానులు తిరగనిస్తారా..? నా చొక్కానే కాదు.. శరీరాన్ని కూడా ముక్కలు ముక్కలుగా పీక్కుపోతారు’ అని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనానికి.. జనసేన తరపున పోటీచేసిన యువ అభ్యర్థులతో కమిటీలు రూపొందిస్తున్నట్లు పవన్‌ తెలిపారు.