నవయుగ సంస్థతో కాంట్రాక్టు ‘క్లోజ్‌’

Published: Friday August 02, 2019
పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టు హెడ్‌వర్క్స్‌ పనుల నుంచి తప్పిస్తున్నామని... కాంట్రాక్టును రద్దు చేస్తున్నామని నవయుగ ఇంజనీరింగ్‌ కంపెనీకి రాష్ట్ర జల వనరుల శాఖ నోటీసు జారీ చేసింది. కాంట్రాక్టు ఒప్పందంలోని 89.3 క్లాజును అనుసరించి ముందస్తుగా కాంట్రాక్టును రద్దు (ప్రీ క్లోజర్‌) చేసుకుంటున్నామని పోలవరం ప్రాజెక్టు చీఫ్‌ ఇంజనీరు సుధాకర బాబు గతనెల 29à°¨ నవయుగ సంస్థకు నోటీసు జారీ చేశారు. కాంట్రాక్టును అప్పగించిన సంస్థను కలసి వీలైనంత త్వరగా ఆర్థిక లావాదేవీలన్నీ తేల్చుకోవాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టులో మిగిలిపోయిన స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ తదితర పనులు ఏడాదిలో పూర్తి చేసేందుకు జల వనరుల శాఖ గతంలో నవయుగతో ఒప్పందం చేసుకుంది. à°ˆ ఒప్పందం విలువ రూ.1244.35 కోట్లు. వీటితోపాటు పవర్‌ హౌస్‌ ఫౌండేషన్‌ పనులకు రూ.918.76 కోట్లతో ఒప్పందం కుదిరింది.
 
 
కాఫర్‌ డ్యామ్‌, ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) గ్యాప్‌-1, అప్రోచ్‌ చానల్‌ కోసం రూ.751.55 కోట్లు .. మొత్తంగా రూ.3914.66 కోట్ల నవయుగతో ఒప్పందం చేసుకున్నట్లుగా నోటీసులో వెల్లడించారు. ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌స్ట్రాయ్‌ మాత్రమే చేపట్టాల్సిన పనులను ఈసీపీ విధానానికి వ్యతిరేకంగా విడదీసి నవయుగ సంస్థకు అప్పగించారని 2019 జూన్‌ 14à°¨ సమావేశంలో నిపుణుల కమిటీ తేల్చినట్లు à°ˆ నోటీసులో తెలిపారు. ‘‘పోలవరం పనులను ఈపీసీ à°•à°¿à°‚à°¦ అప్పగించాక అంచనాలు పెంచడం, 60-సీ à°•à°¿à°‚à°¦ నోటీసులు జారీ చేయడం, పనులను ఇతరులకు నామినేషన్‌ పద్ధతిలో అప్పగించడం మార్గదర్శకాలకు విరుద్ధం. పోలవరం ప్రాజెక్టు పనులకు రివర్స్‌ టెండర్‌ విధానాన్ని అమలు చేయాలని నిపుణుల కమిటీ సూచించింది. అందువల్ల మీరు తక్షణమే పనులు నిలిపివేయండి’’ అని నవయుగ సంస్థకు ఇచ్చిన నోటీసులో తెలిపారు.