9 బ్యాంకులపై ఆర్‌బీఐ జరిమానా

Published: Sunday August 04, 2019
నిబంధనలు ఉల్లంఘించే బ్యాంకుల పట్ల భారత రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) కఠినంగా వ్యవహరిస్తోంది. పెద్ద మొత్తంలో జరిమానా విధిస్తోంది. తాజాగా ఏడు వాణిజ్య బ్యాంకులకు ఆర్‌బీఐ జరిమానా విధించింది. వీటిలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కూడా ఉన్నాయి. మోసాలను వెల్లడించడంలో జాప్యం తదితర కారణాలతో à°ˆ జరిమానాలను ఆర్‌బీఐ విధించింది. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ మోసాన్ని వెల్లడించడంలో జాప్యం చేసినందుకు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు ఆర్‌బీఐ రూ.50 లక్షల జరిమానా విధించింది.
 
కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ విషయంలోనే ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌కు రూ.1.5 కోట్ల జరిమానా పడింది. ఆర్‌బీఐ ఆదేశం అందిన 14 రోజుల్లోగా à°ˆ జరిమానాను చెల్లించాల్సి ఉంటుందని బ్యాంకు తెలిపింది. యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పంజాబ్‌ అండ్‌ సింద్‌ బ్యాంక్‌లకు రూ.కోటి చొప్పున జరిమానా విధించారు. మోసాల వెల్లడికి సంబంధించిన నిబంధనలు పాటించకపోవడం వల్ల ఎస్‌బీఐకి రూ.50 లక్షల జరిమానా పడింది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఫెడరల్‌ బ్యాంక్‌లకు రూ.50 లక్షల చొప్పున ఆర్‌బీఐ జరిమానా విధించింది.
 
 
కార్పొరేషన్‌ బ్యాంకుకు రూ.కోటి, అలహాబాద్‌ బ్యాంకు, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలకు రూ.2 కోట్ల చొప్పున, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంకు, యూబీఐలకు రూ.1.5 కోట్ల చొప్పున, ఓబీసీకి రూ.1 కోటి జరిమాను ఆర్‌బీఐ విధించింది.