రద్దు చేస్తూపోతే పెట్టుబడులు ఎవరు పెడతారు

Published: Sunday August 04, 2019
 ‘‘ప్రస్తుతం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు. పోలవరం నిర్మాణం పాత ధరలకే నవయుగ కంపెనీకి కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ అప్పగిస్తే దానిని కూడా రద్దు చేయడం విడ్డూరం. విద్యుత్‌ ఒప్పందాలనూ ఏకపక్షంగా రద్దు చేశారు. à°’à°• ప్రభుత్వం ఇచ్చిన వాటిని సహేతుకమైన కారణాలు చెప్పకుండా రద్దు చేస్తూ పోతే ఇక రాష్ట్రంలో పెట్టుబడులు ఎవరు పెడతారు?’’ అని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు పురందేశ్వరి ప్రశ్నించారు.
 
 
తూర్పు గోదావరి జిల్లా కోరుకొండలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదాపై మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టమైన ప్రకటన చేశారని గుర్తు చేశారు. గతంలో చంద్రబాబు మభ్య పెట్టినట్లే నేటి సీఎం జగన్‌ కూడా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. గోదావరి జలాలను తెలంగాణ భూ భాగం నుంచి నాగార్జునసాగర్‌, శ్రీశైలానికి తరలించే విషయంలో ఇక్కడి ప్రజలను ముఖ్యంగా రైతులను ఒప్పించాల్సిన బాధ్యత సీఎంపై ఉందని పురందేశ్వరి స్పష్టం చేశారు.