పవన్‌ కల్యాణ్‌.. క్షమాపణ చెప్పు

Published: Monday August 05, 2019
తెలంగాణ ఉద్యమం గురించి సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆయన ఇంటి ముందు, జనసేన తెలంగాణ కార్యాలయం ఎదుట పలువురు ఆందోళన నిర్వహించారు. తెలంగాణ ఉద్యమం తా గుడుతో ముడిపడి ఉందని ఉద్యమకారులు, గిరిజనులను కించపరిచేలా పవన్‌ కల్యాణ్‌ à°“ సభలో మాట్లాడారని.. ఇందుకు ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్‌ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పవన్‌కల్యాణ్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు. కాగా.. వారి ఆందోళనపై పవన్‌ కల్యాణ్‌ భీమవరంలో స్పందించారు. రెండు రోజుల నిమిత్తం భీమవరంలో ఉన్న ఆయన.. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమైనప్పుడు à°ˆ అంశం ప్రస్తావనకు వచ్చింది. ‘‘నేను తెలంగాణలో ఎవర్నో కించపరిచేలా మాట్లాడానట. అదీ ఐదు రోజుల క్రితం. నేను మాట్లాడింది వేరు. వారు చెప్పేది వేరు. ఎప్పడో ఐదు రోజుల క్రితం మాట్లాడితే దాన్ని à°ˆ రోజు తెరపైకి తెచ్చి.. భీమవరంలో నా కార్యక్రమం హైలైట్‌ అవకుండా చేసే ప్రయత్నమిది. అసలు నేను మాట్లాడిన విషయం జగన్‌ చెప్పిన మద్యపాన నిషేధం అంశానికి సంబంధించింది.
 
పుచ్చలపల్లి సుందరయ్య రాసిన తెలంగాణ సాయుధ పోరాటం పుస్తకంలో చదివిన అంశాన్ని ప్రస్తావించాను. మద్యపానం అనేది కొన్ని గిరిజన తెగల్లో, కొన్ని రాష్ట్రాల్లో సంస్కృతిలో భాగంగా ఇమిడిపోయిందని అన్నాను. ప్రజల నుంచి సంస్కృతిని వేరు చేయలేం కాబట్టి మద్యపాన నిషేధం కష్టమవుతుందన్నాను. తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులు సైతం మద్యపాన నిషేధం ఎందుకు చేయలేమన్నప్పుడు.. అది వారి సంస్కృతిలో భాగంగా భావించారు. మన గిరిజనులు ఇప్ప పువ్వు నుంచి సారా తీస్తారు. అది వారి సంస్కృతి. వద్దన్నా ఆగరు. ఇలా నేను మాట్లాడింది ఒకటైతే.. దాన్ని వక్రీకరించి టీఆర్‌ఎస్‌ వ్యక్తులో, కార్యకర్తలో తెలియదుగానీ మా ఇంటి మీద దాడికి ప్రయత్నించారు. ప్రజాస్వామ్యంలో ఏదైనా మాట్లాడినప్పుడు దాన్ని మీడియా ముఖంగా ఖండించాలి. అంతేగానీ, దాడులకు దిగడం మంచిది కాదు. ‘ఇళ్లమీదకి వస్తాం. ఆఫీసుల మీదకు వస్తాం’ అంటే చూస్తూ ఊరుకోను. తాట తీస్తా. నేను తప్పు మాట్లాడి ఉంటే క్షమించాలని అడుగుతా. నా చిన్న బిడ్డలు ఉన్న ఇంటి మీదికి వచ్చి ధర్నాలు దాడులు చేస్తామంటే మాత్రం చేతులు ముడుచుకు కూర్చోను. మీరు భీమవరం వచ్చి రాజకీయాలు చేయవచ్చు. నేను à°’à°• అభిప్రాయం చెప్తే ఇలాంటి పనులు చేస్తారా? à°ˆ విషయాన్ని తెలంగాణ గవర్నర్‌ నరసింహన్‌ దృష్టికి, సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తా’’ అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ‘పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికీ హామీ ఇస్తున్నాను. బీజేపీసహా ఏ పార్టీలోనూ విలీనం చేయను