పార్టీపై దౌర్జన్యాలను ఎదుర్కోవడానికి అండగా ఉంటా

Published: Monday August 05, 2019
‘పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికీ హామీ ఇస్తున్నాను. పార్టీని బలంగా నడిపిస్తాను. బీజేపీసహా ఏ పార్టీలోనూ విలీనం చేయను. రాష్ట్ర ప్రజలకు, ఓటేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెబుతూ భీమవరం నుంచి మాట ఇస్తున్నా. ఇక్కడ నుంచి ఓడిపోయినా.. ఓడించబడ్డ నేల నుంచి చెబుతున్నా.. జనసేన ఎప్పటి వరకూ ఉంటుందంటే మీలో నలుగురు నన్ను మోసే వరకు!’ అని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ స్పష్టం చేశారు. నర్సాపురం లోక్‌సభ పరిధిలోని నాయకులు, కార్యకర్తలతో ఆదివారం రాత్రి ఉండి శివారు కోట్లా కల్యాణ మండపంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో హాజరైన కార్యకర్తలను ఉద్దేశించి పవన్‌ ప్రసంగించారు.
 
జగన్‌మోహన్‌రెడ్డి ఏం మాట్లాడతారు. ఇది విమర్శ కాదు. ఈరోజుకూ చాలాచోట్ల పెన్షన్లు ఇవ్వలేదు. మూడు వేలు ఇస్తానని కేవలం రూ.250 పెంచారు. à°—à°¤ నెల 8à°¨ ఇచ్చారు. à°ˆ నెల ఇప్పటికీ కొన్నిచోట్ల అందలేదు. ఇసుక కొరత గురించి లేఖ రాశాను. దీనిపై వారు ఏదో పాలసీ తీసుకొస్తున్నామన్నారు. దాని గురించి ఎదురుచూద్దాం. ఇంకా కష్టాలు ఎదురైతే అప్పుడు ఆలోచిద్దాం. సమస్యలపై ఎమ్మెల్యేలను నిలదీయాలి. మన నాయకులు, కార్యకర్తలను వైసీపీ ఇబ్బంది పెడుతుంటే ఊరుకోను. ముందు ఫిర్యాదులు చేయండి. అప్పటికీ మాట వినకపోతే నేను వస్తాను. చట్టపరంగా ఏం చేయాలో ఆలోచిద్దాం. ప్రస్తుతం బెదిరిస్తున్నారు. పరిస్థితులు ఇంకా దారుణంగా ఉండే రోజులు వస్తాయి. మీ మీద దెబ్బపడాలంటే ముందు నా à°’à°‚à°Ÿà°¿ మీద పడాలి. మీ à°’à°‚à°Ÿà°¿ మీద గాయం పడాలంటే నా తల తెగిపడాలి’ అని వ్యాఖ్యానించారు.