శ్రీశైలానికి వరద ఉధృతి

Published: Monday August 05, 2019
 à°¶à±à°°à±€à°¶à±ˆà°²à°‚ జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. జూరాల నుంచి 2.28లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తుండటంతో డ్యాం నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. డ్యాం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు, పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, ఆదివారం సాయంత్రం 7గంటలకు 858.50 అడుగుల వద్ద 101.43 టీఎంసీల వరద చేరింది. గతేడాది ఇదే సమయానికి డ్యాంలో 152టీఎంసీల నిల్వ నమోదైంది. డ్యాంలో నీటినిల్వలు పెరిగేకొద్దీ సంగమేశ్వరాలయం జలాధివాసానికి చేరువవుతోంది. మరో మూడు, నాలుగు అడుగుల నీరు చేరితే ఆలయం పూర్తిగా నీట మునుగుతుంది. తిరిగి జనవరి, ఫిబ్రవరిలోనే గుడి బయటపడే అవకాశం ఉంది. దాదాపు ఆరేడు నెలల పాటు జలగర్భంలో ఉంటున్నా, à°ˆ ఆలయంలోని వేపదారు లింగం చెక్కుచెదరకపోవడం విశేషం. కాగా, తుంగభద్ర జలాశయానికి స్వల్పంగా వరద కొనసాగుతోంది. డ్యాంలో ప్రస్తుతం 1609.07 అడుగుల వద్ద 33.50 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ఎగువ నుంచి 17,817 క్యూసెక్కుల వరద చేరుతోంది.
 
 
శ్రీశైలం డ్యాంలో నీటిమట్టం 810అడుగులకు చేరుకోగానే ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి, 835 అడుగులపైకి చేరుకుంటే హంద్రీనీవా ప్రధాన లిఫ్టు మాల్యాల నుంచి కృష్ణా వరద జలాలు ఎత్తిపోసుకోడానికి అవకాశం ఉంది. 841-845 అడుగులు దాటితే పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా ఎస్‌ఆర్‌బీసీ, తెలుగుగంగ, కేసీ కాలువలకు నీటిని మళ్లించవచ్చు. గోరుకల్లు, వెలుగోడు, అవుకు, అలగనూరు, పత్తికొండ, కృష్ణగరి జలాశయాల్లో దాదాపు 35టీఎంసీలు నిల్వ చేసుకునే అవకాశం ఉంది. డ్యాం నీటిమట్టం 857 అడుగులు దాటినా ఎత్తిపోతల పథకాల ద్వారా నీరివ్వకపోవడంతో రాయలసీమ రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కళ్లెదుటే నదీ జలాలు దిగువకు పోతున్నా, తమ గురించి పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.