డివైడర్‌కు బైక్‌ ఢీ.. తలపగిలి 13ఏళ్ల బాలుడి దుర్మరణం

Published: Wednesday August 07, 2019
13 ఏళ్ల అబ్బాయి తల్లిదండ్రులు చిరుద్యోగులు. వారికి వచ్చే డబ్బు ఇంటి ఖర్చులకే చాలడం లేదని, తన చదువు కోసం వారు పడుతున్న కష్టాల్లో కొంతైనా ఆసరా కావాలనుకున్నాడా చిన్నారి. పేపర్‌ బాయ్‌à°—à°¾ మారాడు. రోజూ స్కూల్‌కు వెళుతూనే ఉదయం 5:30కు లేచి సైకిల్‌పై ప్రతి గల్లీ తిరుగుతూ ఇంటింటికీ పేపర్‌ వేసేశాడు! అయితే చిన్నవయసులోనే తల్లిదండ్రులకు కొండంత à°…à°‚à°¡à°—à°¾ ఉంటున్న à°† చిన్నారిని విధి నిర్దయగా కాటేసింది. à°† దంపతులకు తీరని గర్భశోకాన్ని మిగిల్చింది. పేపర్లు వేసేందుకు బయలుదేరి బైక్‌ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. హైదరాబాద్‌లోని శివం రోడ్డులో జరిగిందీ విషాదం. రోడ్డుపై ఉన్న గుంతలే బాలుడి ప్రాణాలను మింగాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
 
మృతుడు తొమ్మిదో తరగతి విద్యార్థి అభినవ్‌ (13). బాగ్‌అంబర్‌పేటలో ఉంటున్న వెంకట్రావ్‌, సంగీత దంపతుల ఒక్కగానొక్క కుమారుడు. వెంకట్రావ్‌ à°“ ప్రైవేటు సంస్థలో చిరుద్యోగి. తల్లేమో డీడీ కాలనీలోని నారాయణ స్కూల్లో ఆయా. అభినవ్‌ కూడా అదే స్కూల్లో చదువుతున్నాడు. రోజూలాగే మంగళవారం కూడా పేపర్‌ వేయడానికి అభినవ్‌ వెళ్లాడు.
 
 
à°† రోజు ఏజెంట్‌ దగ్గర పనిచేసే మరో పేపర్‌ బాయ్‌ రాకపోవడంతో అతడికి సంబంధించిన పేపర్లు ఓయూ గేట్‌ వద్ద ఇవ్వడానికి ఏజెంట్‌ బైక్‌ను తీసుకొని అభినవ్‌ ఒక్కడే వెళ్లాడు. మెయిన్‌ రోడ్డు మీద అదుపు తప్పిన ద్విచక్రవాహనం సర్వీసు రోడ్డులోని గుంతల్లో దిగి ఎగిరింది. à°† వేగంలోనే డివైడర్‌ను ఢీకొట్టింది. డివైడర్‌కు అభినవ్‌ తల బలంగా తగలడంతో తీవ్ర గాయాలయ్యాయి. నెత్తుటి మడుగులో గిలగిలా కొట్టుకుంటూ అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఒక్కగానొక్క కొడుకు మృతిచెందడంతో గుండెలవిసేలా రోదిస్తున్న తల్లిదండ్రులను ఓదార్చడం ఎవ్వరి వల్లా కాలేదు. అభినవ్‌ తల్లిదండ్రుల పేదరికం తెలిసి.. అంబర్‌పేట్‌ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌, నారాయణ స్కూల్‌ ప్రిన్సిపల్‌ రూ. 10వేల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. అభినవ్‌ చదివే స్కూలుకు మంగళవారం సెలవు ప్రకటించారు. శివం రోడ్డులో గుంతలు ఉన్నాయని, అవి లేకపోతే అభినవ్‌ బైక్‌ అదుపు తప్పేది కాదేమోనని కొందరు అభిప్రాయపడ్డారు. అభినవ్‌తో పాటు పనిచేసే పేపర్‌ బాయ్‌ శ్రీనివాస్‌ వస్తే అభినవ్‌ బైక్‌పై వెళ్లేవాడు కాదని ఏజెంట్‌ సతీశ్‌ బాధపడ్డాడు