జమ్మూ కశ్మీరు ‘విలీనం’ సంపూర్ణం

Published: Wednesday August 07, 2019
భారత్‌లో సుందర కశ్మీరం విలీనం పరిపూర్ణమైంది! జమ్మూ కశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తి పూర్తిగా రద్దయింది! ఇప్పటి వరకూ రాష్ట్రంగా ఉన్న జమ్మూ కశ్మీరు రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడిపోయింది! జమ్మూ కశ్మీరు, లద్ధాఖ్‌ కేంద్ర పాలిత ప్రాంతాల ఏర్పాటుకు పార్లమెంటు ఆమోద ముద్ర వేసింది! సంబంధిత బిల్లులకు సోమవారం రాజ్యసభ ఆమోదం తెలపగా.. మంగళవారం లోక్‌సభ భారీ మెజారిటీతో గ్రీన్‌సిగ్నల్‌ తెలిపింది. తొలుత, ఉదయం సభ ప్రారంభం కాగానే.. కేంద్ర హోం మంత్రి అమిత్‌ à°·à°¾ రెండు తీర్మానాలను, జమ్మూ కశ్మీరు పునర్వ్యవస్థీకరణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. కాంగ్రెస్‌ తరపున మాజీ మంత్రి మనీశ్‌ తివారీ చర్చను ప్రారంభించారు. à°ˆ సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. భాగస్వాములను సంప్రదించకుండా ఏకపక్షంగా ఎలా కేంద్రం నిర్ణయిస్తుందని విపక్షాలు నిలదీశాయి.
 
చర్చకు హోం మంత్రి అమిత్‌ à°·à°¾ సమాధానమిచ్చారు. పీవోకేను ఎలా స్వాధీనం చేసుకోవాలో తమకు తెలుసునని వ్యాఖ్యానించారు. పాక్‌ ఆక్రమణలో ఉన్న కశ్మీర్‌ కూడా భారత్‌లో అంతర్భాగమేనని, చైనా ఆక్రమించిన ఆక్సాయ్‌ చిన్‌ కూడా మనదేనని, పీవోకేను బీజేపీ, మోదీ వదిలేది లేదని, అక్కడి 24 సీట్లు కూడా తమ లెక్కలో ఉన్నాయని, మన ఆధీనంలోకి వచ్చిన తర్వాత వాటికి కూడా ఎన్నికలు జరుపుతామని స్పష్టం చేశారు. పీవోకే, ఆక్సాయ్‌ చిన్‌లను సాధించడానికి తమ ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధమేనని అన్నారు. సాధారణ పరిస్థితులు నెలకొంటే రాష్ట్ర హోదాను పునరుద్ధరించడానికి ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. తమది చారిత్రక తప్పిదం కాదని, చారిత్రక తప్పిదాన్ని సరి చేస్తున్నామని తేల్చి చెప్పారు. వాడి వేడి చర్చ అనంతరం ఓటింగ్‌ నిర్వహించారు. జమ్మూ కశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసే బిల్లుకు అనుకూలంగా ఏకంగా 351 ఓట్లు రాగా.. వ్యతిరేకంగా 72 మంది ఓటు వేశారు. ఒకరు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఇక, à°† రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుకు అనుకూలంగా 370 మంది ఓటు వేయగా.. వ్యతిరేకంగా 70 మంది ఓటేశారు.
 
ఓటింగ్‌ నుంచి ఎస్పీ, ఎన్సీపీ, తృణమూల్‌ కాంగ్రెస్‌, ఎన్డీయే మిత్రపక్షమైన జేడీయూ వాకౌట్‌ చేయగా.. బీజేడీ, టీడీపీ, టీఆర్‌ఎస్‌, బీఎస్పీ, వైసీపీ, అన్నాడీఎంకే బిల్లులకు మద్దతు ఇచ్చాయి. కాంగ్రెస్‌, డీఎంకే, ఐయూఎంఎల్‌, ఎన్సీపీ, లెఫ్ట్‌ పార్టీలు వ్యతిరేకించాయి. ఇప్పటికే రాజ్యసభ ఆమోదం పొందడంతో జమ్మూ కశ్మీరు బిల్లులు రెండు సభల్లోనూ ఆమోదం పొందినట్లయింది. ఉభయ సభలు ఆమోదం తెలపడంతో బిల్లును రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు పంపనున్నారు. ఆయన ఆమోదం తర్వాత బిల్లు చట్టరూపం దాల్చనుంది. కాగా, రాజ్యసభకు దూరంగా ఉన్న ప్రధాని మోదీ మంగళవారం లోక్‌సభకు వచ్చారు. ఓటింగ్‌ సమయంలో సభలోనే ఉన్నారు. సభలోకి వస్తున్న ఆయనకు బీజేపీ సభ్యులు అపూర్వ స్వాగతం పలికారు. పెద్దపెట్టున బల్లలు చరుస్తూ ‘భారత్‌ మాతాకీ జై’ నినాదాలతో హోరెత్తించారు.