కశ్మీర్ లోయ ఒక స్థిరాస్తి మాత్రమే

Published: Saturday August 10, 2019
కశ్మీర్ ఏమిటి? జమ్మూ కశ్మీర్ వివాద వ్యవహారాలు, పరిణామాలపై అనేక సార్లు రాశాను. అయితే ప్రస్తుత సందర్భం భిన్నమైనది. ఎందుకని? జమ్మూ కశ్మీర్ ఇంకెంతమాత్రం ఇదివరకటి జమ్మూ కశ్మీర్ కాదు. à°† రాష్ట్రాన్ని విభజించారు. ఒకే రాష్ట్రం స్థానంలో ఇప్పుడు రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. à°’à°•à°Ÿà°¿- లద్దాఖ్; రెండు- జమ్మూ కశ్మీర్. భారత రాజ్యాంగం à°•à°¿à°‚à°¦ à°’à°• రాష్ట్రాన్ని à°’à°• కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడం ఇంతకు ముందెన్నడూ జరగలేదు. ఇలా స్థాయి తగ్గింపు నగుబాటు, కాదు అన్యాయం కశ్మీర్‌కే సంభవించింది.
 
2019 ఆగస్టు 5, 6 తేదీలలో మూడు అంశాలకు పార్లమెంటు ఆమోదాన్ని పొందడంలో ప్రభుత్వం విజయవంతమయింది. (1) అధికరణ 370 రద్దు, ప్రత్యామ్నాయం : అధికరణ 370లోని మొదటి నిబంధనను రద్దు చేశారు; 3à°µ నిబంధనను సవరించారు. ఇది, ప్రమాదకరమైన న్యాయ తప్పిదమా లేక అతి తెలివితో అమలుపరిచిన న్యాయ వ్యూహమా అనేది కాలం, న్యాయస్థానాలు మాత్రమే చెప్పగలుగుతాయి. మనలాంటి మానవ మాత్రులు మాత్రం ప్రభుత్వ చర్యను à°’à°• తెలివైన రాజ్యాంగ విన్యాసంగా మాత్రం అభివర్ణించగలరు. కేవలం ఒకే ఒక్క నిబంధనతో కూడిన కొత్త 370 అధికరణ ఇంకెంతమాత్రం à°’à°• ప్రత్యేక ఏర్పాటు కాదు; అది, మన రాజ్యాంగమంతటినీ యావత్ జమ్మూ కశ్మీర్‌కు వర్తింప చేస్తుంది. (2) జమ్మూ కశ్మీర్ రాష్ట్రాన్ని విభజించి, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలను సృష్టించే విభజన ప్రతిపాదనపై పార్లమెంటు ఉద్దేశాలు తెలుసుకోవడం: à°ˆ విధమైన ప్రతిపాదనలను పరిశీలించి ఆమోదించే లేదా తిరస్కరించే హక్కు, జమ్మూ కశ్మీర్ రాజ్యాంగాన్ని రూపొందించిన రాజ్యాంగసభకు సంక్రమించింది. విచిత్రంగా, à°’à°• గొప్ప ఉపాయంతో à°† రాజ్యాంగ సభ జమ్మూ కశ్మీర్ శాసనసభ అయింది; అదే à°† తరువాత పార్లమెంటు అయింది! మరింత స్పష్టంగా చెప్పాలంటే పార్లమెంటు అభిప్రాయాలు తెలుసుకున్నాక రాష్ట్ర విభజన తీర్మానాన్ని పార్లమెంటు ఆమోదిస్తుంది! ఇందులో, మానవమాత్రుల అవగాహనా శక్తికి అతీతమైన à°’à°• అధిభౌతిక లేదా పారలౌకిక సూత్రం ఉందని నేను భావిస్తున్నాను. (3) జమ్మూకశ్మీర్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ, రెండు కేంద్రపాలిత ప్రాంతా లను సృష్టించడం: à°’à°• రాష్ట్రాన్ని విభజించి రెండు రాష్ట్రాలను సృష్టించిన పూర్వ దృష్టాంతాలను అనుసరించే జమ్మూ కశ్మీర్ (పునర్వ్యవస్థీకరణ) బిల్లు-–2019ని రూపొందించినట్టు చెప్పారు కాని à°† పూర్వోదాహరణలకు, దీనికీ మధ్య à°’à°• తేడా ఉన్నది. à°ˆ కొత్త బిల్లు à°’à°• రాష్ట్రాన్ని విభజించి రెండు రాష్ట్రాలను కాక రెండు కేంద్ర పాలిత ప్రాంతాలను ఏర్పాటు చేసింది! అంటే à°’à°• రాష్ట్ర స్థాయిని కేంద్ర పాలిత ప్రాంతంగా కుదించివేసింది.
జమ్మూ కశ్మీర్ రాష్ట్ర స్థాయిని ఇలా రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా తగ్గించి వేయడం పట్ల సహజంగానే అధికార పక్ష సభ్యులకు ఎటువంటి అభ్యంతరం లేకపోయింది. ఇందులోని అసంబద్ధతను వారేమీ పట్టించుకోలేదు. అయితే, వివిధ రాష్ట్రాలలో అధికారంలో ఉన్న అన్నాడిఎంకె, బిజూ జనతాదళ్, జనతాదళ్ (యు), తెలంగాణ రాష్ట్ర సమితి, ఆమ్ ఆద్మీ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదలైన వాటికి ఈ విభజన బిల్లులో ఎటువంటి దోషం కన్పించకపోవడం ఆశ్చర్యకరమే. ఆ ప్రాంతీయ పార్టీలన్నీ జమ్మూ కశ్మీర్ విభజనకు అనుకూలంగా ఓటు వేశాయి. బెంగాల్ అధికార పక్షం తృణమూల్ కాంగ్రెస్ మాత్రం ఓటింగ్ సమయంలో వాకౌట్ చేసింది.