వైసీపీకి అనుకూలంగా పోలీసులు

Published: Saturday August 10, 2019
 à°°à°¾à°·à±à°Ÿà±à°°à°‚లో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని, మరీ ముఖ్యంగా పల్నాడులో వైసీపీ నేతలు ఫ్యాక్షన్‌ రాజకీయాలకు తెరలేపారని టీడీపీ నేతలు ఆరోపించారు. గ్రామాలకు గ్రామాలు ఖాళీ చేయాల్సిన పరిస్థితి వస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. దీనికి ముఖ్యమంత్రి జగన్‌ బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. à°ˆ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలతో ‘చలో పల్నాడు-సేవ్‌ డెమోక్రసి’ నినాదంతో పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు నేతృత్వంలో శుక్రవారం ఆందోళనకు దిగారు.
 
రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని నేతలు మండిపడ్డారు. మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్‌, మద్దాలి గిరిధర్‌, ఎమ్మెల్సీ ఏఎస్‌ రామకృష్ణలతో పాటు ముఖ్యనేతలతో కలిసి గుంటూరు నుంచి భారీ వాహన శ్రేణితో పల్నాడుకు వెళ్లారు. కార్యక్రమంలో భాగంగా సత్తెనపల్లి డీఎస్పీ విజయభాస్కరరెడ్డి, గురజాల డీఎస్పీని శ్రీహరిబాబును కలిసి పల్నాడులో నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. అనంతరం, మాజీ స్పీకర్‌ కోడెల మాట్లాడుతూ.. గ్రామాల్లో రౌడీ రాజ్యం చలామణి అవుతోందని విమర్శించారు.
 
ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు నిస్సహాయత ప్రదర్శిస్తూ ‘కొన్నాళ్లు గ్రామాలు వదిలేయండి’ అని టీడీపీ కార్యకర్తలకు సలహాలు ఇస్తున్నారని మండిపడ్డారు. దీంతో వ్యవసాయ భూములు బీడులను తలపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ.. అధికారం శాశ్వతం కాదన్నారు. జులం చూపుతున్న వైసీపీ నేతలు భవిష్యత్తు గురించి ఆలోచించాలని సూచించారు. తిరిగి టీడీపీ అధికారంలోకి వస్తే మీ పరిస్థితి ఏంటని హెచ్చరించారు. వారం రోజుల్లో సమస్య పరిష్కరించకపోతే గ్రామాల్లో తిష్ఠవేస్తామని హెచ్చరించారు. ఓటు వేయకపోతే జీవించే హక్కును హరిస్తారా? అంటూ మరో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ప్రశ్నించారు.