గృహ నిర్బంధంలో ఒమర్‌, మెహబూబా వాగ్వాదం

Published: Tuesday August 13, 2019
జమ్మూ కశ్మీరులోకి బీజేపీని నువ్వే తీసుకొచ్చావ్‌! కాదు.. నువ్వే తీసుకొచ్చావ్‌’ .. మాజీ ముఖ్యమంత్రులు, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ మధ్య చోటుచేసుకున్న వాగ్వాదమిది. పార్లమెంటులో జమ్మూ కశ్మీరు బిల్లును ప్రవేశపెట్టడానికి ముందే వీరితోపాటు పలువురు రాజకీయ నాయకులను అదుపులోకి తీసుకుని శ్రీనగర్‌లోని హరి నివాస్‌లో గృహ నిర్బంధంలో ఉంచిన విషయం తెలిసిందే. అక్కడి గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఒమర్‌ అబ్దుల్లాను ఉంచితే.. మొదటి అంతస్తులో మెహబూబా ఉన్నారు. ‘‘జమ్మూ కశ్మీరులోకి బీజేపీ రావడానికి నువ్వే కారణమని ఒకరికొకరు ఆరోపించుకున్నారు. à°’à°• సందర్భంలో మెహబూబాపై ఒమర్‌ గట్టిగా అరిచారు.
 
2015, 2018ల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నందుకు ఆమెతోపాటు ఆమె తండ్రి ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌ను తప్పుబట్టారు’’ అని ప్రొటోకాల్‌ విభాగానికి చెందిన అధికారి ఒకరు తెలిపారు. దాంతో, వాజపేయి హయాంలో బీజేపీతో మీ తండ్రి ఫరూఖ్‌ అబ్దుల్లా పొత్తు పెట్టుకున్నారని మెహబూబా ఎత్తిపొడిచారని తెలిపారు. ‘‘వాజపేయి ప్రభుత్వంలో నువ్వు విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా పనిచేశావు’’ అని ఆమె గట్టిగా అరిచారని తెలిపారు. అంతేనా.. 1947లో జమ్మూ కశ్మీర్‌ను భారతదేశంలో కలిపి పెద్ద తప్పు చేశారంటూ ఒమర్‌ తాత షేక్‌ అబ్దుల్లాను మెహబూబా తప్పుబట్టారని వివరించారు. హరి నివా్‌సలోని సిబ్బంది అంతా వినేలా గట్టిగా అరుచుకున్నారు. దాంతో, అధికారులు ఇద్దరినీ వేర్వేరుగా ఉంచారు.