ఫుడ్ డెలివరీ పేరుతో మద్యాన్ని హోం డెలివరీ

Published: Tuesday August 20, 2019

అతను స్విగ్గీలో ఫుడ్ డెలివరీ బాయ్. à°—à°¤ ఏడు నెలలుగా డెలివరీ బాయ్‌à°—à°¾ పనిచేస్తున్నాడు. రెండు నెలల క్రితం పెళ్లయింది. చేతిలో సరిపడా డబ్బు లేకపోయినా అప్పు చేసి మరీ పెళ్లి చేసుకున్నాడు. à°† అప్పులు తీర్చేందుకు డెలివరీ బాయ్‌గానే సైడ్ బిజినెస్‌కు తెరలేపాడు. ఫుడ్ డెలివరీ పేరుతో మద్యాన్ని హోం డెలివరీ చేయడం మొదలుపెట్టాడు. 20 రోజులుగా సాఫీగానే సాగుతున్న రాహుల్ దందాకు పోలీసులు చెక్ పెట్టారు. రాహుల్‌‌పై పోలీసులకు అనుమానమొచ్చి.. అతని వద్ద ఉన్న స్విగ్గీ ఫుడ్ డెలివరీ బ్యాగ్‌ను తనిఖీ చేయగా.. 6 బీర్ టిన్స్ కనిపించాయి. బీర్ టిన్స్‌తో పాటు రూ.7 వేల విలువ చేసే స్మార్ట్ ‌ఫోన్, రూ.40 వేల డబ్బును పోలీసులు సీజ్ చేశారు. గుజరాత్‌లోని వడోదరాలో à°ˆ విషయం వెలుగుచూసింది.