డాక్టర్ చేసిన పనికి.. ఎమ్మెల్యే గణేష్‌ ఎంట్రీ..

Published: Tuesday August 20, 2019
 à°ªà±à°°à°¸à°µ వేదనతో ఉన్న ఆరుగురు గర్భిణులకు ఆస్పత్రి వైద్యుల నిర్వాకం మరింత నరకాన్ని చూపింది. నవమాసాలు నిండిన వారికి సరైన సమయంలో శస్త్ర చికిత్సలు చేసి పండంటి బిడ్డలను చేతిలో పెట్టాల్సిన ప్రాణదాతలే ఇలా వ్యవహరించడంపై అంతా ముక్కున వేలేసుకున్నారు. చివరకు à°ˆ విషయం ఎమ్మెల్యే చెవిన పడడంతో ఆయన వచ్చి పరిస్థితులను చక్కదిద్దడంతో ప్రాణా పాయాలే తప్పాయి. నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రిలో సోమవారం చోటుచేసుకున్న à°ˆ ఘటన వివరాలిలా ఉన్నాయి. నర్సీపట్నం, కోటవురట్ల, వేములపూడి, రోలుగుంట తదితర ప్రాంతాల నుంచి ఆరుగురు గర్భిణులు నెలలు నిండడంతో నాలుగు రోజుల క్రితమే ప్రాంతీయ ఆస్పత్రిలో చేరారు. వారికి సుఖ ప్రసవం కాకపోవడంతో డాక్టర్‌ గౌతమినాయుడు సోమవారం శస్త్రచికిత్సలు చేసేందుకు ఉదయం సిద్ధమయ్యారు. మత్తు డాక్టర్‌ సుధాకర్‌ డ్యూటీలో ఉండడంతో ఆపరేషన్‌ థియేటర్‌లో అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.
 
ఆపరేషన్‌ థియేటర్‌లో గైనికాలజిస్ట్‌à°•à°¿, మత్తు డాక్టర్‌à°•à°¿ ఏమైందో ఏమో తెలియదు గానీ.. ఒక్క సారిగా మత్తు డాక్టర్‌ థియేటర్‌లోంచి బయటకు వచ్చేశారు. తనకు ఆరోగ్యం బాగోలేదని సూపరింటెండెంట్‌తో చెప్పి సెలవు పెట్టి వెళ్లిపోయారు. గర్భిణులకు సకాలంలో శస్త్ర చికిత్సలు జరగ కపోవడంతో అవస్థలు పడ్డారు. వారి వారి బంధువులంతా ఆందోళన చెందారు. దీంతో చేసేది లేక విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించేందుకు ప్రాంతీయ ఆస్పత్రి వైద్యులు ఏర్పాట్లు చేశారు. ఇది విన్న గర్భిణుల బంధులు లబోదిబోమన్నారు. ఇప్పటి వరకు ఆస్పత్రిలో ఉంచి, ఇప్పటికిప్పుడు వెళ్లిపొమ్మంటే ఎక్కడికి వెళతామని వైద్యులను నిలదీశారు.
 
ఆస్పత్రిలో జరిగిన విషయాన్ని వైసీపీ నాయకుల ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే గణేష్‌ వెంటనే అక్కడికి వచ్చారు. వైద్య విధాన పరిషత్‌ జిల్లా కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ నాయక్‌తో సమస్యపై చర్చించారు. తక్షణమే మత్తు డాక్టర్‌ని ఏర్పాటు చేయాలని కోరారు. ప్రాంతీయ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ డేవిడ్‌, రోగుల ద్వారా జరిగిన విషయంపై ఆరా తీశారు. ఆస్పత్రిలో అన్ని ఆధునిక సౌకర్యాలు ఉన్నప్పటికీ డాక్టర్ల పని తీరు బాగోకపోవడంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని సూపరింటెండెంట్‌పై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. మత్తు డాక్టర్‌ వచ్చి ఆపరేషన్లు పూర్తి చేసేవరకూ ఆస్పత్రి వద్దే ఉంటానని చెప్పి సుమారు మూడు à°—à°‚à°Ÿà°² పాటు ఆస్పత్రిలోనే ఎమ్మెల్యే ఉండిపోయారు.
 
 
నేరుగా వైద్య ఆరోగ్య శాఖా మంత్రి పేర్ని నానితో ఎమ్మెల్యే గణేష్‌ ఫోన్‌లో మాట్లాడారు. ఆస్పత్రిలో జరిగిన ఘటనను వివరించారు. దీంతో అనకాపల్లి ఆస్పత్రి నుంచి గైనకాలజిస్ట్‌, మత్తు డాక్టర్‌ వచ్చి ఆపరేషన్లు పూర్తి చేశారు. à°•à°¥ సుఖాంతం కావడంతో గర్భిణుల బంధువులు ఆనందం వ్యక్తం చేశారు.