ఈ యాప్‌ ముందే పసిగట్టేస్తుంది

Published: Wednesday August 21, 2019
నడకని కొలిచే యాప్స్‌, నిద్రని ఎనలైజ్‌ చేసే యాప్స్‌, ఆరోగ్య సలహాలిచ్చే యాప్స్‌, ఆహారాన్ని సజెస్ట్‌ చేసే యాప్స్‌ ... ఇలా నిత్యజీవితంలో ఆరోగ్యంగా ఉండేందుకు ఉపయోగపడే యాప్స్‌ చాలానే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మన మెంటల్‌ కండిషన్‌ని కనుక్కోగలిగే యాప్‌ కూడా వచ్చేసింది! వాచ్‌ యువర్‌ టాక్‌... అనే యాప్‌ మీ మెంటల్‌ కండిషన్‌ని అంచనా వేస్తుంది. మీలో ఏమాత్రం డిప్రెషన్‌ ఉన్నా.. à°† విషయాన్ని కనిపెట్టేసి హెచ్చరిస్తుంది.
 
 
à°ˆ డిప్రెషన్‌ చెకింగ్‌ యాప్‌ని తయారు చేసింది ‘విశాల్‌ రానా’ అనే ప్రవాస భారతీయుడు. ఆస్ట్రేలియాలోని ఎడిలాయిడ్‌‌లో ఉండే వ్యక్తి ఈయన తన టీమ్‌‌తో కలిసి తయారు చేసిన à°ˆ యాప్ - డిప్రెషన్‌ ఏర్పడడానికి ఏడాది ముందే à°† విషయాన్ని కనిపెట్టేస్తుందట. దాన్ని బట్టి అవసరమైన విధంగా ఎలర్ట్‌ చేసి, రక్షిస్తుందట!
 
 
ఇంతకీ à°ˆ యాప్‌ ఎలా పనిచేస్తుంది? అనుకుంటున్నారా? à°ˆ యాప్‌ పేరు ‘వాచ్‌ యువర్‌ టాక్‌’ … అన్న పేరులోనే ఉంది! ఇది మీ ఫోన్లోనే ఉంటుంది కాబట్టి, మీతోనే నిత్యం ఉండే ఫోన్‌ ఆధారంగా- నిరంతరం మీ మాటల్ని గమనిస్తూ ఉంటుంది. అంటే మీ పక్కనే ఉంటూ - బ్యాక్‌గ్రౌండ్‌లో పనిచేస్తూ మీ టాక్స్‌ మీద à°“ కన్నేసి ఉంచుతుంది.
 
 
డిప్రెషన్‌లోకి వెళ్లేవాళ్లు, కొద్దికాలంలో ఆత్మహత్య చేసుకోబోయే వ్యక్తులు... ఎలాంటి సంభాషణలు చేస్తారన్నది ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా సైంటిస్టులు కనిపెట్టారు. à°† డేటా, దానికి సంబంధించిన ఎనాలిసిస్‌ అంతా యాప్‌లో అంతర్భాగంగా ఉంటుంది. వాటి ఆధారంగా à°ˆ యాప్‌... మీలో డిప్రెషన్‌ ఏర్పడుతోందీ అంటే.. వెంటనే పసిగట్టేస్తుంది.
 
 
ఇదంతా నిజమేనా? సాధ్యమేనా? అనకండి. à°ˆ యాప్‌ చాలా శాస్త్రబద్ధంగా తయారయిందని నిపుణులు అంటున్నారు. రివ్యూయర్ల మాటల్ని బట్టి చూసినా కూడా - ఇదేదో అల్లాటప్పా యాప్‌ అని కొట్టి పారేయలేం. కాలక్రమంలో à°ˆ యాప్‌ పనితీరు సమర్థంగా ఉందని తోస్తే, ప్రపంచవ్యాప్తంగా ఇది సక్సెస్‌ అయితే … దీని ఆధారంగా à°’à°• టీవీ బేస్డ్‌ హెల్త్‌ సర్వీస్‌ మాదిరిగా దీన్ని పెంచేందుకు కూడా - దీని క్రియేటర్లు ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే దీని బేస్‌ వెర్షన్‌ గూగుల్‌ ప్లే స్టోర్లో లభిస్తోంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీ మెంటల్‌ హెల్త్‌ ఎలా ఉందో చెక్‌ చేసుకోండి!