విజయసాయి ప్రకటనపై తీవ్ర అసహనం

Published: Friday August 23, 2019

 à°ªà±‹à°²à°µà°°à°‚ ప్రాజెక్టు అథారిటీ వద్దని చెప్పినప్పటికీ.. రీటెండరింగ్‌ ప్రక్రియను ఆహ్వానించడమేకాకుండా, ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌షాల ఆశీస్సులతోనే నిర్ణయం తీసుకున్నామని వైసీపీపీ నేత విజయసాయిరెడ్డి ప్రకటించడంపై కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. రీటెండరింగ్‌కు మోదీ ఆశీస్సులున్నాయని విజయసాయిరెడ్డి, దాన్ని ఖండిస్తూ బీజేపీ ఎంపీ సుజనా చౌదరి చేసిన ప్రకటనలు షెకావత్‌ దృష్టికి వెళ్లినట్టు సమాచారం. ఇదే సమయంలో జల విద్యుత్‌ ప్రాజెక్టు టెండర్‌ రద్దును హైకోర్టు నిలిపివేసింది. à°ˆ నేపథ్యంలో తాజా పరిణామాలన్నింటిపైనా ఆయన తన శాఖకు చెందిన అధికారులతో సమీక్షించినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. పోలవరం ప్రాజెక్టుపై తదుపరి నిర్ణయం తీసుకునే ముందు మోదీ, అమిత్‌ షాతో చర్చిస్తానని మంత్రి వారికి చెప్పినట్లు తెలిసింది. పోలవరం ప్రాజెక్టు కేంద్రమే చేపట్టాలన్న డిమాండ్ల గురించి చర్చకు రాగా, à°ˆ దశలో అది సాధ్యమా అన్నది చూడాల్సి ఉన్నదని, పెద్ద ఎత్తున పునరావాస ప్రక్రియను కూడా చేపట్టాల్సి ఉన్నదని షెకావత్‌ అభిప్రాయపడ్డట్లు సమాచారం. కాగా పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తయ్యేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా బీజేపీ ఎంపీ సుజనా చౌదరి షెకావత్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టు విషయంపై విజయసాయిరెడ్డి ప్రధాని పేరును ప్రస్తావించిన తర్వాతే తాను స్పందించానని షెకావత్‌కు వివరించినట్టు తెలిసింది.