రాజధానిని మా శవాలపై తరలించండి

Published: Monday August 26, 2019
రాజధానికి సంబంధించి మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై భూ ములిచ్చిన రైతులు మండిపడ్డారు. à°’à°• పక్క వార్షిక కౌలు జమ చేయకపోగా.. రాజధానికి ముంపు ప్రమా దం ఉందని బొత్స పదే పదే చెబుతుండడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిని తరలించాలనుకుంటే తమ శవాలపై తరలించాల్సి ఉంటుందని హెచ్చరించారు. సచివాలయం ఉన్న గ్రామం వెలగపూడిలో ఆదివారం వారు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. వైసీపీకి చెందిన కార్యకర్తలు, నేతలు à°ˆ ధర్నాలో ముందు నిలవడం గమనార్హం. ‘రాజధానికి వరద ముంపు లేదు.. వందల ఏళ్ల నుంచి à°ˆ గ్రామాలు వరదకు గురైన దాఖలాలు లేవు’ అని స్పష్టం చేశారు. ‘బొత్స వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి.. రాజధానికి ముంపు ప్రమాదం లేదు.. కౌలు వెంటనే చెల్లించాలి’ అని నినాదాలు చేశారు. మహిళలు కూడా ధర్నాలో కూర్చొని నినదించారు. ‘ఇది ఏ ఒక్క పార్టీకో సంబంధించిన సమస్య కాదు. అన్ని వర్గాల రాజధాని రైతులకు చెందిన అంశం. రాజధాని తరలింపు జరిగితే మా శవాల మీద నుంచి తరలించండి. తాత ముత్తాల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నాం.
 
అప్పటి నుంచి లేని వరద ముంపు ఇప్పుడు ఎలా వస్తుంది? రాజఽధానిలో పనులు కొనసాగించాలి. మాకు కౌలు వెంటనే జమ చేయాలి’ అని రైతు లు ముక్తకంఠంతో డిమాండ్‌ చేశారు. పురుగు మందు డబ్బా చూపిస్తూ చివరకు మాకు ఇదేనా గతి అని కొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బొత్స పదేపదే రాజధానికి ముంపు పొంచి ఉందని.. ఇక్కడ కడితే తీవ్ర ఆర్థిక భారమవుతుందని వ్యాఖ్యలు చేయడం తమను మానసిక ఆందోళనకు గురుచేస్తోందన్నారు. ‘à°ˆ ధర్నా ప్రారంభం మాత్రమే. రాజధానిపై అసత్య ప్రచారాలు చేస్తే పార్టీలకతీతంగా పెద్ద ఎత్తున ఆందోళన ఉఽధృతం చేస్తాం’ అని రైతులు హెచ్చరించారు.