ప్రస్తుతం ఇంద్రకీలాద్రిపై వాస్తు భయం..

Published: Monday August 26, 2019
ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ దేవస్థానానికి వాస్తు దోషముందా? అందువల్లే దేవస్థానానికి కార్యనిర్వహణాధికారులుగా వస్తున్న అధికారులు ఏడాది తిరగకుండానే బదిలీ అయి వెళ్లిపోతున్నారా? ప్రస్తుతం కొండపై జరుగుతున్న చర్చ ఇదే. దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఈవోగా ఏడాది క్రితమే నియమించిన వి.కోటేశ్వరమ్మను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఆమె స్థానంలో అన్నవరం వీరవెంకట సత్యనారాయణస్వామి దేవస్థానంలో ఇన్‌చార్జి ఈవోగా పని చేస్తున్న à°Žà°‚.వి.సురేష్‌బాబును నియమించింది. ముంబయిలో ఆదాయపు పన్నుశాఖ అధికారిగా పని చేస్తున్న కోటేశ్వరమ్మ డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి వచ్చారు. ఐఆర్‌ఎస్‌ అధికారి అయిన ఆమెను à°—à°¤ ప్రభుత్వం దుర్గగుడి ఈవోగా నియమించింది. 2018, ఆగస్టు 17à°¨ కోటేశ్వరమ్మ బాధ్యతలు చేపట్టారు. కేవలం ఏడాది కాలం మాత్రమే ఆమె ఈవోగా కొనసాగారు. రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో ప్రభుత్వం ఆమెను బదిలీ చేసింది. కోటేశ్వరమ్మకు ముందు దుర్గగుడి ఈవోగా పని చేసిన ఐఏఎస్‌ అధికారి, ప్రస్తుత రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్‌ à°Žà°‚.పద్మను కూడా అప్పటి ప్రభుత్వం ఏడాది తిరగకుండానే బదిలీ చేసింది.
 
à°—à°¤ ఏడాది ఆషాఢమాసంలో భక్తులు అమ్మవారికి సమర్పించిన ఖరీదైన చీర మాయమైన సంఘటన ఈవో పద్మ బదిలీకి కారణమైంది. పద్మకు ముందు ఈవోగా పని చేసిన మరో ఐఏఎస్‌ అధికారి సూర్యకుమారి కూడా ఏడాదికే బదిలీపై వెళ్లిపోయారు. గతంలో ఇంద్రకీలాద్రిపై తాంత్రిక పూజలు నిర్వహించారనే ఆరోపణలు వివాదాస్పదం కావడంతో సూర్యకుమారిని ప్రభుత్వం బదిలీ చేసింది. à°—à°¤ ఏడాది ఈవోగా వచ్చిన ఐఆర్‌ఎస్‌ అధికారి కోటేశ్వరమ్మ ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా దేవస్థానం అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారన్న పేరు తెచ్చుకున్నారు. అయినప్పటికీ రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో ఆమెను ప్రభుత్వం అకస్మాత్తుగా బదిలీ చేసింది.
 
కనకదుర్గమ్మ దేవస్థానానికి ఈవోలుగా నియమితులైన ఇద్దరు ఐఏఎస్‌ అధికారులు, à°’à°• ఐఆర్‌ఎస్‌ అధికారి ఏడాదికే బదిలీపై వెళ్లిపోవడానికి కొండపైనున్న వాస్తు దోషమే కారణమంటూ దేవస్థానం వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈవోగా కోటేశ్వరమ్మ బాధ్యతలు నిర్వర్తించిన కార్యాలయ మహామండపం ఏడో అంతస్థుపై దేవస్థానానికి దక్షిణ భాగాన ఉండటం వాస్తు రీత్యా మంచిది కాదని, అందువల్లే ఈవో కోటేశ్వరమ్మపై ఎలాంటి ఆరోపణలు లేకపోయినా బదిలీపై వెళ్లాల్సి వచ్చిందని కొందరు వాదిస్తున్నారు. గతంలో ఈవో కార్యాలయం అమ్మవారి ప్రధాన ఆలయం పైభాగంలో ఉండేది.
 
అయితే అప్పటి ఈవో సూర్యకుమారి à°† కార్యాలయాన్ని ఖాళీ చేసి కొండ దిగువన పాతబస్తీ బ్రాహ్మణ వీధిలో ఉన్న దేవస్థానం అతిథి గృహం (ప్రస్తుతం అది దుర్గగుడి పరిపాలన విభాగం)లో ఈవో కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సూర్యకుమారి బదిలీ తర్వాత వచ్చిన పద్మ ఈవో కార్యాలయం కొండ దిగువన ఉండటం వల్ల సమస్యలు ఎదురవుతున్నాయని, కొండపైనే ఈవో కార్యాలయం ఉండాలని భావించారు. దాంతో మహామండపం ఏడో అంతస్థులో ఇంతకుముందు వీఐపీ లాంజ్‌à°—à°¾, పోలీసు అధికారులు ఫ్రోటోకాల్‌ కార్యాలయంగా వినియోగించే చాంబర్‌ను వేరేచోటకు మార్పించి.. దానిని ఈవో కార్యాలయంగా మార్చుకున్నారు. పద్మ బదిలీ తర్వాత ఈవోగా వచ్చిన కోటేశ్వరమ్మ కూడా అదే కార్యాలయాన్ని వినియోగించుకున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు తడిసిపోయి à°† కార్యాలయ సీలింగ్‌ పెచ్చులూడి ఈవో కోటేశ్వరమ్మ తలపై పడటంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. à°ˆ సంఘటన తర్వాత కూడా కోటేశ్వరమ్మ అదే కార్యాలయంలో కొనసాగారు.