పల్నాడులోని 16 గ్రామాల్లో భయం నీడలు వెంటాడుతూన్నాయి

Published: Tuesday August 27, 2019
రాష్ట్రంలో ప్రభుత్వం అధికారం మారి మూడు నెలలు గడుస్తున్నా నేటికీ పల్నాడులోని 16 గ్రామాల్లో భయం నీడలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆయా గ్రామాల్లో వైసీపీ నేతల అరాచకాలతో టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఊళ్లు వదిలి వెళ్లిపోయారు. ఆయా గ్రామాల్లో భయానక వాతావరణం నేటికీ కొనసాగుతూనే ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు à°ˆ విషయంపై అసెంబ్లీలో ప్రస్తావించేందుకు యత్నించినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ‘సేవ్‌ డెమోక్రసీ - సేవ్‌ పల్నాడు’ పేరుతో టీడీపీ నేతల బృందం à°ˆ నెల 9à°¨ పల్నాడులో పర్యటించి సత్తెనపల్లి, గురజాల డీఎస్పీలకు ఫిర్యాదులు చేసినా ఫలితం శూన్యం. వారం రోజుల్లో ఆయా గ్రామాల్లో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేలా చూస్తామని ఆయా డీఎస్పీలు ఇచ్చిన హామీలు ఆచరణలో అమలు కాలేదు.
 
మరో వైపు ఆయా నేతలు, కార్యకర్తలు గ్రామాల్లో పొలాలను వదిలి వెళ్లిపోయారు. కనీసం పొలాలను కౌలుకు ఇద్దామన్నా సాగు చేసే అవకాశం లేకుండా చేశారు. ముఖ్యంగా గురజాల నియోజకవర్గ పరిధిలోని పిన్నెల్లి, జింకలపాలెం, తుమ్మల చెరువు, కరాలపాడు, కోనంకి, ముత్యాలం పాడు, జంగమేశ్వరపురం, చెన్నాయపాలెం, మోర్జంపాడు, జూలకల్లుతో పాటు మాచర్ల నియోజకవర్గంలో నాలుగు, నరసరావుపేట నియోజకవర్గంలో రెండు గ్రామాల్లో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. à°ˆ నేపథ్యంలో పల్నాడులోని పరిస్థితులపై సోమవారం టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు నేతృత్వంలో మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్‌, ఎమ్మెల్సీ రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ రాయపాటి శ్రీనివాస్‌, నరసరావుపేట, గుంటూరు తూర్పు ఇన్‌ ఛార్జ్‌లు చదలవాడ అరవిందబాబు, నసీర్‌ అహ్మద్‌ తదితరులు రూరల్‌ ఎస్పీ జయలక్ష్మిని కలిసి ఫిర్యాదు చేశారు. పల్నాడు ప్రాంతంలో నేటికి పరిస్థితుల్లో మార్పు రాలేదని, కొందరు పోలీసులు వైసీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని, దీంతో టీడీపీ కార్యకర్తలు గ్రామాల్లోకి వెళ్లే పరిస్థితి లేకుండా పోయిందని వారు ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు.