కొత్త మద్యం పాలసీలో కోణాలెన్నో

Published: Tuesday August 27, 2019
ఆబ్కారీ విధానంలో శరవేగంగా మార్పులు చేస్తున్నారు. వచ్చే నెల నుంచి కొత్త విధానాన్ని అమలులోకి తెస్తున్నారు. ప్రభుత్వాధికారుల చేతుల మీదుగానే అమ్మకాలు సాగుతాయి. లాభమైనా, నష్టమైనా అంతా వాళ్ళ చేతుల్లోనే. పర్యవేక్షణ ఆసాంతం ప్రభుత్వానిదే. పైకి దశల వారీగా మద్యం నిషేధం పేరిట అమలులోకి తెస్తున్న సరికొత్త మద్యం పాలసీలో అనేక కోణాలు ఉన్నట్లు చెబుతున్నారు. పూర్తిగా అమలులోకి వస్తే తప్ప లొసుగులు ఏవీ బయటపడవు. వాస్తవానికి ఏదైనా వ్యాపారానికి అవసరమైంది అన్ని హంగులతో కూడిన దుకాణం.
 
అయితే కొత్తగా ఏర్పాటు చేయబోయే మద్యం షాపుల కోసం ఇటీవల యజమానుల నుంచి టెండర్లు కోరారు. తమకు సంబంధించిన దుకాణం అద్దెకు ఇచ్చేందుకు వీలుగా ప్రతీ నెలా అద్దెతో కూడిన టెండర్‌ను ఏ యజమాని అయినా ఇట్టే దాఖలు చేయవచ్చు. సుమారు 363కుపైగా దుకాణాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగానే యజమానుల నుంచి సంతృప్తికర ఒప్పందాలను చేసుకుని కీలక ప్రాంతాల్లో వ్యాపారం చేసేందుకు వీలుగా సర్కార్‌ తాజాగా సరికొత్త అడుగు వేసింది. ఎవరో à°’à°•à°°à°¿ ఇద్దరు తప్ప పెద్దగా అద్దెకు షాపును ఇచ్చేందుకు సిద్ధపడకపోవచ్చునని తొలుత భావించారు.
 
ఇప్పటి వరకు మద్యం సిండికేట్లు తమకు లభించిన షాపుల నిర్వహణకు అద్దెను ఖాతరు చేయకుండా పెద్ద మొత్తంలో చెల్లించే వారు. కూడళ్ళలోనూ, జనంతో కిక్కిరిసిన ప్రాంతాల్లోనూ దుకాణాలు తెరిచేందుకు పోటీలు పడేవారు. ఇప్పుడది గాడి తప్పింది. ఏకంగా ప్రభుత్వమే మద్యం వ్యాపారానికి ముందుకు వచ్చింది. తగ్గట్టుగానే గతంలో ఒప్పందం కుదుర్చుకున్న దుకాణాల్లో మద్యం షాపులు కొనసాగేవి. ఇప్పుడు కొత్తగా దుకాణాల కోసం టెండర్లు పిలిచారు. జిల్లావ్యాప్తంగా 600లకు పైగానే ఎక్సైజ్‌ అధికారులకు టెండరు దరఖాస్తులు అందాయి. ఇంత వరకు పెద్ద విచిత్రమేమి లేదు. కాని రూపాయికే తాము షాపు కేటాయించడానికి సిద్ధంగా ఉన్నామంటూ దాదాపు 14 మందికిపైగా టెండర్లు సమర్పించారు. మద్యం వ్యాపారానికి వీలుగా ఇంత స్వల్ప మొత్తంలో షాపు ఇవ్వడానికి సిద్ధపడటం వెనుక కారణాలను అన్వేషిస్తున్నారు.
 
వాస్తవానికి అతి తక్కువ ధరతో ఎవరైతే షాపులు ఇవ్వడానికి ముందుకు వస్తారో అటువంటి టెండర్లకే ప్రభుత్వం మొగ్గు చూపుతుంది. ఈసారి అదే ప్రక్రియను అవలంభించారు. తక్కువ ధరకు కేవలం నెలకు రూపాయికే షాపు కేటాయించేందుకు ముందుకు వచ్చిన దరఖాస్తులకు ఆమోదముద్ర వేశారు. ఇక ఎటు తిరిగి ఆయా షాపులు ఏ ప్రాంతంలో, ఏ రకమైన పరిస్థితుల్లో ఉన్నాయో తేల్చాల్సిందే ఆబ్కారీ శాఖే. కాని విచిత్రం ఏమిటంటే ఏదో స్వచ్ఛంద సేవ చేయడానికి, ఆధ్యాత్మిక పెంచి పోషించేలా ఏవో కార్యక్రమాలు జరుగుతాయన్నట్టు నెలకు అద్దె రూపాయి ఇస్తే చాలన్నట్టుగా ఆయా యజమానులు ఎందుకంత వితరణ చేశారు. దీనిలో అసలు రహస్యం ఏమిటి, ఎవరైనా కావాలని ఆయా ప్రాంతాల్లోనే సర్కారీ మద్యం దుకాణాలు ఉండేందుకు వీలుగానే à°ˆ రకమైన చర్యలకు దిగారా ? మరేమైనా కారణాలు దీనిలో దాగున్నాయా ? అనే ప్రశ్నలు వెన్నాడుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఆబ్కారీ శాఖతోపాటు, మద్యం వ్యాపారంతో ముడిపడిన వారందరికీ రూపాయి అద్దె హాట్‌ టాపిక్‌à°—à°¾ మారింది.