రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలకు ఆస్కారం

Published: Wednesday August 28, 2019
కాంగ్రెస్ కురువృద్ధుడు మన్మోహన్ సింగ్‌ను మరో సారి కాంగ్రెస్ అధిష్ఠాన వర్గం రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎందుకు ఎంపిక చేసింది? ఇప్పటికే కాంగ్రెస్ కురువృద్ధుల పార్టీ అని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు రాహుల్ గాంధీ అస్త్ర సన్యాసం చేయడంతో 72ఏళ్ల సోనియాగాంధీ మళ్లీ పార్టీ పగ్గాలు చేపట్టాల్సి వచ్చింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో కూడా కాంగ్రెస్ యువకులను ముఖ్యమంత్రులుగా నియమించలేకపోయింది. రాజ్యసభలో మన్మోహన్ సింగ్ ఎప్పుడో కాని మాట్లాడిన సందర్భాలు లేవు. మరి ఆయనను మళ్లీ రాజ్యసభకు ఎంపిక చేయడం ద్వారా కాంగ్రెస్ ఏ సంకేతాలు పంపిస్తోంది.. అన్న ప్రశ్న గురించి ఆలోచిస్తే ప్రస్తుత సందర్భంలో à°† పార్టీకి నైతిక స్వరూపాన్నిచ్చే నేతల ఆవశ్యకత కనిపించినందువల్లే ఆయనను క్రియాశీలకంగా ఉంచడం అనివార్యమైందన్న జవాబు లభిస్తుంది.
 
యుపిఏ మొదటి దఫా సర్కార్‌లో à°’à°• విధేయుడైన నేతగా ప్రధానమంత్రి పగ్గాలు చేపట్టిన మన్మోహన్ సింగ్ నైతికతకు గుర్తింపు లభించినందువల్లే రెండో సారి కూడా ఆయనను సోనియాగాంధీ తప్పనిసరై ప్రధానమంత్రిని చేయాల్సి వచ్చింది. కాంగ్రెస్ అధికారం కోల్పోయిన ఆరు సంవత్సరాల తర్వాత మన్మోహన్ సింగ్‌ను మళ్లీ రాజ్యసభకు ఎంపిక చేయాల్సిన ఆవశ్యకతలో కాంగ్రెస్ ఉన్నదంటే à°† పార్టీ ఎంతగా నైతిక దారిద్ర్యంలో ఉన్నదో అర్థమవుతుంది. ఒక్క మన్మోహన్ సింగ్ తప్ప సోనియాగాంధీ చుట్టూ ఉన్న నేతల్లో అత్యధికులు కాంగ్రెస్‌కు నైతికంగా కానీ, రాజకీయంగా కానీ ప్రతిష్టను తెచ్చే వారు కనపడడం లేదు. ఆఖరుకు ఎప్పుడూ తెల్లటి చొక్కా, తెల్లటి పంచె ధరించి ఖరాఖండీగా మాట్లాడే మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం కూడా ఇప్పుడు అవినీతి ఆరోపణలపై సిబిఐ కస్టడీలో à°—à°¤ వారం రోజులుగా మగ్గాల్సి వస్తున్నదంటే కాంగ్రెస్ నైతికత విషయంలో తీవ్రంగా ఆత్మరక్షణలో పడినట్లు స్పష్టమవుతున్నది. విచిత్రమేమంటే రాహుల్, ప్రియాంకలతో పాటు పార్టీ సీనియర్ నేతలు, మొత్తం à°† పార్టీ న్యాయవాద గణం రంగంలోకి దిగి చిదంబరంను సమర్థించేందుకు పూనుకున్నా ప్రజల్లో వీసమెత్తు కూడా సానుభూతి కనపడడం లేదు. అంతేకాదు, మన్మోహన్ సింగ్ లాంటి ఒకరిద్దరి విషయంలో తప్ప కాంగ్రెస్ నేతలు నీతిపరులని చెబితే నమ్మేవారు తక్కువగా కనపడుతున్నారు.
 
ఈ పరిస్థితిని ఆసరాగా తీసుకుని భారతీయ జనతా పార్టీ వ్యూహకర్తలు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ఒక్కొక్కర్నీ ఒక పద్ధతి ప్రకారం శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రతి రాష్ట్రంలోనూ కాంగ్రెస్ నేతలు లేదా వారి బంధువులు ఏదో ఒక కేసులో ఇరుక్కుని గిలగిలలాడుతున్నారు. మళ్లీ ఎన్నికలు వచ్చే సరికి కాంగ్రెస్ నేతల్లో 90 శాతం మంది ఊచలు లెక్కపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకైనా మంచిదని బిజెపిలో చేరితే కాని వారు తమను తాము రక్షించుకునేలా కనపడడం లేదు. అందువల్ల కాంగ్రెస్ అధిష్ఠానం వెంటనే మేలుకుని పార్టీని సమూలంగా ప్రక్షాళన చేసి తన స్వరూప స్వభావాలు మార్చుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన కృషి చేస్తేనే దాని మనుగడ సాధ్యపడుతుందేమోనని అనిపిస్తోంది.
 
ఇంతకీ చిదంబరం అవినీతిపరుడా? ఆయన కుటుంబ పూర్వాపరాలు చూసినా, చదువు సంధ్యలు చూసినా భారీ ఎత్తున అవినీతి చేయాల్సిన అవసరం ఏమీ లేదు. హార్వర్డ్‌లో చదివిన ప్రముఖ న్యాయవాది కనుక ఆర్థిక మంత్రి అయ్యే వరకూ వేదాంత లాంటి కంపెనీలకు ఆయన న్యాయసలహాదారుగా ఉన్నారు. à°ˆ రీత్యా ఐఎన్‌ఎక్స్ మీడియాకు రూ.305 కోట్ల మేరకు విదేశీ పెట్టుబడులకు అనుమతినిచ్చి చిల్లర తీసుకోవాల్సిన ఆగత్యం ఆయనకు లేదు. కాని కాంగ్రెస్ సంస్కృతిలో రాజకీయాలకూ, అవినీతికి అవినాభావ సంబంధం ఏర్పడినందువల్ల పనులకోసమో, నియామకాల కోసమో వచ్చిన వారి నుంచి ఎంతో కొంత వసూలు చేస్తే తప్ప à°† పార్టీలో రాజకీయ నేతలకు విలువ ఉండదు. à°† సంస్కృతి జనానికి తెలిసినందువల్లే చిదంబరం కుటుంబానికి ఉన్న వేల కోట్ల ఆస్తులన్నీ ప్రజాధనాన్ని కొల్లగొట్టే సంపాదించారనే అభిప్రాయం ఏర్పడింది.