అధికారులకు ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశం

Published: Saturday August 31, 2019

రాష్ట్రంలో వాటర్‌గ్రిడ్‌ పథకం à°•à°¿à°‚à°¦ మూడు దశల్లో పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం తాగునీటి సరఫరాపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఉద్దానం తాగునీటి ప్రాజెక్టును శ్రీకాకుళం జిల్లా అంతటికీ వర్తింపచేయాలని సూచించారు. ‘మొదటి దశలో శ్రీకాకుళం, ఉభయగోదావరి, ప్రకాశం జిల్లాల్లో పరిశుభ్రమైన తాగునీటి వసతి కల్పించాలి. రెండో దశలో విజయనగరం, విశాఖపట్నం, రాయలసీమ జిల్లాలకు.. మూడో విడతలో కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాలకు అందించాలి’ అని పేర్కొన్నారు. నీటిని తీసుకున్న చోటే శుద్ధి చేసి అక్కడ నుంచి పంపిణీ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. దీనిపై నిశిత అధ్యయనం చేసి ప్రణాళికలు ఖరారు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న తాగునీటి చెరువులు, సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకులను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. అందులో తాగునీరు నింపిన తర్వాత కలుషితం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో తగిన ఆలోచనలు చేయాలని సూచించారు. కిడ్నీ వ్యాధి బాధిత ప్రాంతాల్లో ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ నుంచి నేరుగా ఇళ్లకే à°ˆ తాగునీటిని పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు.