బీటెక్‌ విద్యార్థుల ఇసుక సంపాదన

Published: Sunday September 01, 2019
‘తివిరి ఇసుమున తైలంబు దీయవచ్చు’ అని భర్తృహరి సుభాషితం! ఇసుకను పిండితే ‘తైలం’ రాకపోవచ్చుగానీ.. రాష్ట్రంలోని బీటెక్‌ విద్యార్థులు ఇసుక బుకింగ్‌లతో వేలల్లో ‘తైలం (డబ్బు)’ సంపాదిస్తున్నారు! ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇసుక విధానం పుణ్యమాని.. దాన్నే ఆదాయమార్గంగా మార్చుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో అలా అమ్మకానికి పెట్టగానే.. ఇసుక లారీల యజమానుల కోసం ఇలా బుక్‌ చేసి, క్షణాల్లో వేలాది రూపాయలు జేబులో వేసేసుకుంటున్నారు. తెలంగాణ వచ్చాక ఏర్పడిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సరికొత్తగా ఇసుక పాలసీని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
 
ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎ్‌సఎండీసీ) నదుల్లోని ఇసుక రీచ్‌à°² వద్ద క్రయ, విక్రయాలు జరుగకుండా ఆన్‌లైన్‌లోనే ఇసుకను బుకింగ్‌ చేసుకునే విధానాన్ని 2017 జూలైలో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇసుక కావాల్సిన లారీ యజమానులు  www.sand.telangana.gov.in  వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అయ్యి ముందుగా లారీ నంబర్‌ను నమోదు చేసుకోవాలి. ఆధార్‌కార్డుతో అనుసంధానమైన ఫోన్‌ నంబర్‌తో వినియోగదారుగా నమోదవ్వాలి. మధ్యాహ్నం 12 గంటలకు లాగిన్‌ అయ్యి జిల్లాను, ఇసుకరీచ్‌ను ఎంపిక చేసుకుని లారీ నంబర్‌ను, à°Žà°‚à°¤ ఇసుక కావాలి? డెలివరీ చేయాల్సిన చోటు వంటి వివరాలను ఎంటర్‌ చేసి సబ్‌మిట్‌ చేస్తే ఆన్‌లైన్‌ పేమెంట్‌కు వెళ్తుంది. అది సఫలమైతే బుకింగ్‌ జరిగినట్లు ఆర్డర్‌ వివరాలతో à°’à°• నంబర్‌ (ఓఆర్డీ) వస్తుంది. à°† నంబర్‌తో ఇసుకలారీ రీచ్‌కు వెళ్తే అక్కడ ఇసుకను నింపి ఇస్తారు. ఇదంతా లారీ యజమానులకు కష్టం కావడంతో.. కంప్యూటర్‌ గురించి తెలిసినవారిని ఆశ్రయించడం ప్రారంభించారు. క్రమంగా.. ఇదో పెద్ద ఆదాయవనరు అని గుర్తించిన బీటెక్‌ విద్యార్థుల్లో చాలామంది ఇప్పుడు నిత్యం అదే పనిలో ఉన్నారు. ఇసుక బుకింగ్‌కు రోజులో à°’à°• 15 నిమిషాలు కేటాయించి మిగతా సమయంలో ఇతర పనులు చూసుకుంటున్నారు. ఇసుక బుకింగ్‌లపై పట్టు వచ్చినవారు రూ.20 వేల జీతం వచ్చే ప్రైవేటు ఉద్యోగాలను సైతం వదిలేసి ఇసుక బుకింగ్‌లను చేస్తుండడం విశేషం.
 
కొంతమంది లారీ యజమానులు రూ.10 వేల నుంచి రూ.12 వేల దాకా డబ్బు ఇచ్చేందుకు ముందుకొస్తుండడంతో వారి ఉత్సాహం రెట్టింపవుతోంది. దీంతో కాలేజీల్లో ఉన్నా కూడా సరిగ్గా à°† సమయానికి క్లాసులకు డుమ్మా కొట్టి మరీ ఇసుక బుకింగ్‌ కోసం ఆన్‌లైన్‌లో కుస్తీలు పడుతున్నారు. అదృష్టం బాగుండి బుకింగ్‌ అయ్యిందా.. à°† రోజుకు రూ.వేలు సంపాదించినట్టే!! రాకపోతే 2-3 నిమిషాలపాటు కాస్తంత నిరాశ అంతే! మర్నాడు మధ్యాహ్నం మళ్లీ ఇసుక వేట షురూ!! వారి వేట సంగతెలా ఉన్నా.. వేల మంది లాగిన్‌ అయ్యి ఇసుకను బుక్‌చేస్తుండడంతో కృత్రిమ కొరత ఏర్పడుతోంది.
 
కొసమెరుపు: చౌటుప్పల్‌ మండల కేంద్రంలోని à°“ ప్రైవేటు బ్యాంకులో ఓటీపీ లేకుండా ఆన్‌లైన్‌ పేమెంట్‌ చేసే వెసులుబాటు ఉండడంతో.. ఇప్పుడా బ్యాంకుకు డిమాండ్‌ పెరిగిపోయింది. à°† బ్యాంకులో ఉన్న ఖాతాల్లో అత్యధికం.. ఇసుక బుకింగులు చేసేవారివే మరి!