ప్రభుత్వ మద్యం షాపులు ప్రారంభం

Published: Tuesday September 03, 2019
జనావాసాల మధ్య మద్యం షాపులు వద్దంటూ పలు జిల్లాల్లో స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో, అధికారులు వాటిని ప్రారంభించకుండానే వెనుదిరిగారు. à°•à°¡à°ª జిల్లా ఖాజీపేటకు ప్రభుత్వం కేటాయించిన మద్యం షాపును ఎక్సైజ్‌ శాఖాధికారులు బ్రిడ్జి వద్ద ఉన్న à°“ గదిలో ప్రారంభించేందుకు ఆదివారం సమాయత్తం అయ్యారు. దీంతో స్థానిక మహిళలు అక్కడికి చేరుకుని.. ఇక్కడ మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే తాము ఇబ్బందులు పడాల్సి వస్తుందంటూ ఆందోళనకు దిగారు. గతంలో ఇక్కడ ప్రైవేట్‌ మద్యం దుకాణం ఉండగా à°† ప్రాంతంలో తిరిగేందుకు కూడా ఇబ్బంది పడ్డామన్నారు. ప్రస్తుతం జనం కోసం అంటున్న జగన్‌ ప్రభుత్వం ఇక్కడ దుకాణం పెట్టడం సబబు కాదని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల ఆందోళనతో మద్యం దుకాణాన్ని ప్రారంభించకుండా అధికారులు వెనుతిరిగారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు 20à°µ వార్డులో మద్యం షాపును వ్యతిరేకిస్తూ మహిళలు ఆందోళన చేశారు. ఆదివారం మధ్యాహ్నం 2గంటలకు లిక్కరు దిగుమతి చేస్తుండగా మహిళలు అడ్డుకున్నారు. ప్రభుత్వ ఆదేశాలు మేరకు ఇక్కడ ఏర్పాటు చేయాలని సీఐ గిరిజా సత్యకుమారి చెప్పినా మహిళలు వినిపించుకోలేదు. దీంతో చేసేది లేక అధికారులు వెనుతిరిగారు. ఇదే జిల్లాలోని యలమంచిలి మండలం గుంపర్రు శివారు కడిమిపుంత గ్రామంలోనూ మద్యం షాపు ఏర్పాటు చేయవద్దంటూ స్థానిక మహిళలు, పలు కుల సంఘాల నేతలు ఆందోళన చేశారు. అయితే, ఎక్సైజ్‌ ఎస్పై దుర్గారావు గ్రామస్థులకు సర్ది చెప్పారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇక్కడ మద్యం దుఖాణం ఏర్పాటు చేశామని, గ్రామస్థుల అభ్యంతరాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామని చెప్పారు.
 
శ్రీకాకుళం జిల్లా మందస మండలం అంబుగాంలో మద్యం షాపును ప్రారంభించేందుకు వెళ్లిన ఎక్సైజ్‌ అధికారులను గ్రామస్థులు అడ్డుకున్నారు. గతంలో ఇక్కడ మద్యం షాపు ఉండేదని, దానిని నిలిపివేయాలని ‘స్పందన’ కార్యక్రమంలో సైతం ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. తీరా ఇప్పుడు ప్రభుత్వమే మద్యం దుకాణం ఏర్పాటు చేయడమేమిటని ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లో షాపు ఏర్పాటు చేయవద్దంటూ గ్రామస్థులు వంద మంది వరకూ ఎక్సైజ్‌ అధికారులను చుట్టుముట్టారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో స్థానికులు శాంతించారు