రోడ్లు బాగుపడేంత వరకు చలాన్లు కట్టం

Published: Wednesday September 04, 2019
ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెంచిన ట్రాఫిక్‌ చలానాలపై పోలీసులు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే నగరంలోని ట్రై కమిషనరేట్‌à°² పరిధిలోని ప్రతి కూడలిలో కొత్త ఫైన్‌ బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ట్రాఫిక్‌ పోలీసులు కూడళ్లలో నిలబడి వాహనదారులకు, డ్రైవర్లకు కరపత్రాలను పంపిణీ చేస్తూ చలానాల గురించి వివరిస్తున్నారు. ఆటోలు, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణినిస్తున్న ప్రజలు సైతం తెలుసుకోవాలనే ఉద్దేశంతో బస్సుల్లో కరపత్రాలను అతికిస్తున్నారు. ప్రతి కమిషనరేట్‌కు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌ ఖాతాల ద్వారా కూడా పెరిగిన చలాన్లపై అవగాహన కల్పిస్తున్నారు. పెంచిన జరిమానాలు ఇప్పటికే ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో అమల్లోకి వచ్చాయి. త్వరలోనే తెలంగాణలో కూడా అమల్లోకి వచ్చే అవకాశం ఉండటంతో ఇలా పోలీసులు ముందు జాగ్రత్తగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
 
ఒక్క వాహనానికి రూ.5 వేల చొప్పున మూడు సార్లు చలానా పడితే à°† బండిని పోలీసులకు ఇచ్చేయడం తప్ప వేరే మార్గం లేదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నగరంలో నూటికి 90 శాతం మంది వాహనదారులు పేద, మధ్యతరగతి వారే ఉన్నారు. బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి చిన్న చిన్న పనులు, ప్రైవేట్‌ ఉద్యోగాలు చేసుకుంటున్న వారు, ఉన్నత చదవులు చదువుకుంటున్న విద్యార్థులు అధికం. వారు నడిపే వాహనాలు మార్కెట్లో అమ్మితే రూ.20 వేలకు మించి రావు. అలాంటిది పెరిగిన జరిమానాలు à°’à°•à°Ÿà°¿ రెండు విధిస్తే అంతే..! వారు వాహనం అమ్మి జరిమానా చెల్లించడం, లేదం టే à°† వాహనాన్ని పోలీసులకు ఇచ్చేయడం తప్ప మరో మార్గం లేదని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.
 
నగరంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైంది. వాటి గురించి పట్టించుకోవడానికి ప్రభుత్వ అధికారులకు, ప్రభుత్వాని తీరిక లేదుగాని ఉల్లంఘనల పేరుతో భారీగా ట్రాఫిక్‌ చలానాలు పెంచుతారా..? అంటూ ప్రజలు à°—à°¤ 20 రోజులుగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. చలానాలు పెరిగిన విషయం తెలిసినప్పటి నుంచి ప్రభుత్వ తీరుపై వాహనదారులు సోషల్‌ మీడియాలో విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వ పనితీరుకు వ్యతిరేకంగా వివిధ రకాల పోస్టులు వైరల్‌ చేస్తున్నారు. రోడ్ల దుస్థితిని, వాహనదారుల ఇక్కట్లను పట్టించుకోని ప్రభుత్వ అఽధికారులకు కూడా భారీగా జరిమానాలు విధించాలని, ఒక్కో నిర్లక్ష్యానికి ఒక్కో విధంగా ఫైన్‌ విధిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతూ వైరల్‌ చేస్తున్నారు. తాజాగా అధికారుల నిర్లక్ష్యానికి లక్షల్లో జరిమానా విధించాలని డిమాండ్‌ మొదలైంది.