ఇకపై ‘హాఫ్‌’ హెల్మెట్లు వద్దు

Published: Saturday September 07, 2019
 à°¦à±à°µà°¿ చక్రవాహన ప్రమాదాలను అరికట్టడానికి తప్ప నిసరిగా హెల్మెట్లు ధరించాలన్న నిబంధన ఉన్నప్పటికీ కేవలం తూతూ మంత్రంగా సాగుతోంది. నగరంలో చాలా మంది టోపీలను పోలిన హాఫ్‌ హెల్మెట్లు ధరించడం ద్వారా నిబంధనలకు తూట్లు పొడవడం రివాజుగా మారింది. ఇందు కు అడ్డుకట్ట వేయడానికి ఇకపై టోపీల వంటి హెల్మెట్లు ధరించరాదని తప్పని సరిగా ఐఎ్‌సఐ లేదా తత్సమానమైన ఫుల్‌ హెల్మెట్లు ధరించాల ని, లేనిపక్షంలో జరిమానా లు తప్పదని జాయిం ట్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ బీఆర్‌ రవికాంత్‌గౌడ శుక్రవారం హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టం తప్పించడానికే à°ˆ నిబంధన అని అన్నారు.
 
వాహనచోదకులతోపాటు వెనక కూ ర్చున్న వారు కూడా హెల్మెట్‌ ధరించాలన్న ని బంధనను నాయస్థానం సమర్థించినట్లు తెలిపారు. వాహనాలు నడిపే వారి సంరక్షణ కోసం à°ˆ నిబంధన ప్రవేశ పెట్టినప్పటికీ ప్రజలు దీన్ని పాటించకపోవడం దురదృష్టకరంగా పేర్కొన్నారు. నిబంధనలు అమలు చే యాల్సిన కొంతమంది పోలీసులు కూడా హాఫ్‌ హెల్మెట్లు ధరించడం విచారకరమన్నారు. ఇకపై పోలీసులు కూడా నిబంధన అతిక్రమించరాదన్నారు. టోపీలాంటి హెల్మెట్‌ ధరించేవారికి జరిమానా విధించేందుకు చట్టంలో అవకాశం ఉందని, అందువల్ల ఇకపై à°ˆ నిబంధన కఠినతరంగా అమలు చేయనున్నట్లు పడమటి విభాగం డీసీపీ సౌమ్యలత వెల్లడించారు. అయితే ఐఎ్‌సఐ మార్కు హెల్మెట్‌ ధరించాలనే అంశంపై భిన్నాభిపాయ్రాలు వ్యక్తమవుతున్నాయి.