ఇస్రోకు పదేళ్ల బాలుడి లేఖ.

Published: Monday September 09, 2019
చంద్రయాన్‌-2 చివరి ఘట్టంలో విఫలమైనా.. ఇస్రో చేసిన అద్భుతమైన కృషికి ప్రపంచం నలుమూలల నుంచీ ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. అయితే.. ‘స్థైర్యాన్ని కోల్పోవద్దు’ అంటూ ఆంజనేయ కౌల్‌ అనే పదేళ్ల బాలుడు రాసిన లేఖ ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అవుతోంది. దాని పూర్తి సారం..
 
à°…à°‚à°¤ త్వరగా స్థైర్యాన్ని కోల్పోవద్దు. మనం తప్పకుండా చంద్రుణ్ని చేరుతాం. వచ్చే జూన్‌లో లాంచ్‌ చేయనున్న ‘చంద్రయాన్‌-3’ మన లక్ష్యం. ఆర్బిటర్‌ ఇంకా అక్కడే (చంద్రుడి కక్ష్యలో) ఉందన్న విషయాన్ని మర్చిపోవద్దు. అది మనకు ఛాయాచిత్రాలను పంపిస్తుంది. మనం ఎక్కడికి వెళ్లాలో, ఎక్కడ విత్తనాలను నాటి మొక్కలు పెంచాలో అదే మనకు చెబుతుంది. విక్రమ్‌ ల్యాండయ్యే ఉంటుంది. ప్రజ్ఞాన్‌ పనిచేస్తూ గ్రాఫికల్‌ బ్యాండ్స్‌ను మనకు పంపించేందుకు సిద్ధమవుతూ ఉండి ఉంటుంది. అదే జరిగితే విజయం మనచేతుల్లోనే. తదుపరి తరం పిల్లలకు ఇస్రో శాస్త్రజ్ఞులే స్ఫూర్తిదాయకం. ‘ఇస్రో.. నువ్వు మాకు గర్వకారణం.’ దేశం తరఫున ఇస్రోకు హృదయపూర్వక కృతజ్ఞతలు. జైహింద్‌