బాలరాజు చేరికపై వైసీపీలో వర్గపోరు

Published: Monday September 09, 2019
మాజీ మంత్రి, జనసేన నాయకుడు పసుపులేటి బాలరాజు వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారనే ప్రచారం జోరందుకోవడంతో ఆయన్ని అడ్డుకోవడానికి ఆ పార్టీలో ఒక వర్గం ప్రయత్నిస్తుండగా మరో వర్గం ఆహ్వానిస్తున్నది. ఆయన్ని వ్యతిరేకిస్తున్న వర్గం విశ్వప్రయత్నాలు చేస్తున్నది. వివరాల్లోకి వెళితే..
 
à°’à°• అవకాశం ఇవ్వాలని జగన్‌ పిలుపుతో పాడేరు నియోజకవర్గంలో అభ్యర్థితో సంబంధం లేకుండా అన్ని పార్టీల ప్రజలు వైసీపీకి à°…à°‚à°¡à°—à°¾ నిలిచారు. దీంతో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసిన కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ఊహించని భారీ మెజారిటీతో గెలుపొందారు. రాజకీయలకు ఆమె కొత్త కావడంతో మూడు నెలలపాటు పాలన సాదాసీదాగానే సాగుతున్నది. గతంలో భాగ్యలక్ష్మిని వ్యతిరేకించిన వైసీపీ వర్గం ఆమెకు దూరంగానే ఉంటున్నది. నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉన్నప్పటికీ నాయకత్వం పటిష్ఠంగా లేదని వైసీపీ అధిష్ఠానం దృష్టికి నిఘావర్గాలు తీసుకు వెళ్లినట్టు తెలిసింది. ఇది ఇలా ఉండగా కొంతమంది నాయకులు వ్యతిరేకిస్తున్నప్పటికీ కాంగ్రెస్‌ పార్టీని వీడి జనసేనలో చేరిన బాలరాజు ఎన్నికల్లో ఘోరపరాజయం పాలయ్యారు. బాలరాజుకు వ్యక్తిగత ఓటుబ్యాంక్‌ ఉన్నప్పటికీ జనసేనలో చేరడం వల్ల డిపాజిట్‌ కూడా సాధించలేకపోయారని సన్నిహితులు చెబుతున్నారు. దీంతో బాలరాజు కూడా పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది.
 
బాలరాజు సీనియర్‌ నాయకుడు కావడంతో వైసీపీలో చేర్చుకోవాలని కొంతమంది పార్టీ పెద్దలు సుముఖత వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. మాజీ మంత్రి పార్టీలో చేరితే పాడేరు నియోజకవర్గం బాధ్యతలతోపాటు కీలకమైన నామినేటెడ్‌ పదవి కూడా ముఖ్యమంత్రి జగన్‌ అప్పగించనున్నారనే ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే బాలరాజు వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్టు ప్రచారంలో ఉంది. తొలుత ఈనెల 22à°¨ పార్టీలో చేరాలని బాలరాజు భావించినప్పటికీ సరైన ముహూర్తం లేకపోవడంతో దసరా పండుగకు రెండు రోజుల ముందు జగన్‌ సమక్షంలో పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలుస్తోంది.
 
కాగా, బాలరాజు వైసీపీలో చేరడాన్ని ఓ వర్గం ప్రాంతీయ నాయకులు అంగీకరించడం లేదు. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, ఎంపీ మాధవికి కూడా కలిచి వచ్చే నాయకులను కలుపుకుని పోవాలని వైసీపీ అధిష్ఠానం నుంచి ఇప్పటికే సమాచారం అందినట్టు భోగట్టా. దీంతో బాలరాజు వైసీపీలో చేరుతారనే ప్రచారంపై పాడేరు ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని స్పందించడంలేదు. అయితే పాడేరు నియోజకవర్గంలోని ఐదు మండలాల ముఖ్యనాయకులు, పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు సమావేశాలు ఏర్పాటు చేసుకుని బాలరాజు వైసీపీలో చేరితే పార్టీకి నష్టం జరుగుతుందని, అతన్ని పార్టీలో చేర్చుకోవద్దని ప్రకటనలు చేస్తున్నారు.
 
వచ్చే వారంలో చింతపల్లి మండల కేంద్రంలో ఐదు మండలాల ముఖ్యనాయకులు, పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు బాలరాజుని పార్టీలో చేర్చుకోవద్దని భారీ సభను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. అయితే నియోజకవర్గ పరిధిలో ఐదు మండలాల్లోని ఎమ్మెల్యే వ్యతిరేకవర్గం బాలరాజుని కలిసి, పార్టీలో చేరాలని, మీ నాయకత్వంలో నడిచేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పినట్టు ప్రచారం జరుగుతున్నది. ఏది ఏమైనప్పటికీ పాడేరు నియోజకవర్గంలో ఓ వర్గం బాలరాజును వ్యతిరేకిస్తుండగా.. మరో వర్గం ఆయనకు అనుకూలంగా వ్యవహరిస్తున్నది. అయితే పార్టీ నాయకులు ఎవరు వ్యతిరేకించినా బాలరాజు వైసీపీలో చేరడం ఖరారైందని సన్నిహితులు చెబుతున్నారు.