భద్రాచలం వద్ద 42 అడుగులకు చేరిన నీటిమట్టం

Published: Monday September 09, 2019

à°ˆ ఏడాది వరుసగా నాలుగోసారి గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద 42 అడుగులకు, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 10 అడుగులకు నీటిమట్టం చేరింది. బ్యారేజీ నుంచి 7,82,298 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. డెల్టా కాలువలకు 8,700 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. పోలవరం స్పిల్‌వే వద్ద 26.5 మీటర్లు, కాఫర్‌ డ్యామ్‌ వద్ద 26.8 మీటర్లు చొప్పున వరద ప్రవాహం కొనసాగుతోంది. దేవీపట్నం మండలంలోని 36 గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. పోలవరం ఎగువన 19 ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కొత్తూరు కాజ్‌వేపై దాదాపు 14 అడుగులమేర వరద ప్రవహిస్తోంది. కడెమ్మ స్లూయి్‌సకు వరదతో పంటపొలాలు నీటమునిగాయి. యలమంచిలి మండలం కనకాయలంక కాజ్‌వే నీటమునగగా, కట్టుపాలెం వద్ద ఇసుక స్టాక్‌ వరదకు కొట్టుకుపోయింది. ఆచంట మండలంలోని గోదారి ఉగ్రరూపందాల్చింది. సీతానగరం, కోనసీమ లంకల్లోకి నీరు చేరుతోంది