సమీక్షలు చేస్తా.. ఎవరు ఆపుతారో చూస్తా..

Published: Tuesday September 10, 2019
 à°ªà±à°°à°œà°² కోసం ఖచ్చితంగా సమీక్షలు నిర్వహించే బాధ్యత, అధికారం తనకు ఉన్నాయని, దీన్ని ఎవరు ఆపుతారో చూస్తానని స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. మొదట తాను à°’à°• నియోజకవర్గానికి శాసన సభ్యుడినని, à°† తర్వాతే శాసన సభకు సభాపతిని అని ఆయన స్పష్టం చేశారు. పొందూరు మండలం బి.కంచరాం గ్రామంలో సోమవారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. స్పీకర్‌à°—à°¾ తన నియోజకవర్గ అధికారులతో సమీక్ష నిర్వహించకూడదని ఏ రాజ్యాంగం చెప్పిందని ఆయన ప్రశ్నించారు. తనకు నియోజకవర్గ అభివృద్ధే ముఖ్యమని, ప్రజా సంక్షేమం కోసం దేనికైనా సిద్ధమేనన్నారు. స్పీకర్‌à°—à°¾ శాసనసభలో హుందాగా ఉంటానన్నారు.
 
గ్రామ వలంటీర్లను భవిష్యత్‌లో టైంస్కేలు ఉద్యోగులుగా చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారని స్పీకర్‌ సీతారాం అన్నారు. వలంటీర్ల విధులకు ఆటంకం కలిగిస్తే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. గ్రామ సచివాలయా లు ఏర్పడిన తర్వాత à°† సంస్థ ఉద్యోగులతో కలిసి ప్రజలకు సేవలందిచనున్నారన్నారు. భవిష్యత్‌లో రాజకీయాల్లో మహిళలే మహరాణులు అవుతారని, పదవుల్లో వారికి 50 శాతం కేటాయించినట్టు తెలిపారు.
 
మడ్డువలస రెండో దశ పనులను ఆరు నెలల్లో పూర్తి చేసి పొందూరు మండల రైతులకు సాగునీరందిస్తామని స్పీకర్‌ తమ్మినేని తెలిపారు. రూ.15 కోట్ల కోసం à°—à°¤ ప్రభుత్వం పనులు పూర్తి చేయకుండా కాలయాపన చేసిం దని ఆరోపించారు. రైతుల సంక్షేమం కోసం à°† మాత్రం ఖర్చు చేయలేరా? అని ప్రశ్నించారు. మడ్డువలస నిర్మాణం పూర్తిచేసేందుకు తమ ప్రభుత్వం అవసరమైన నిధులను మంజూరు చేసిందని, ఇంకా కావాలంటే విడుదల చేస్తామ న్నారు. మెట్టప్రాంత రైతుల కోసం ఎత్తిపోతల పథకాలకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇప్పటికే నీటిపారుదల అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షుడు కె.రమణమూర్తి, నాయకులు సువ్వారి గాంధీ, పి.రమణమూర్తి, లోలుగు కాంతారావు, కె.సాయికుమార్‌, గంట్యాడ రమేష్‌, జి.నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.