గోదావరి జిల్లాల్లో కల్లోలం

Published: Tuesday September 10, 2019
గోదావరి నది పోటెత్తుతోంది. కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. రాష్ట్రాలో భారీగా వానలు కురవకపోయినా, ప్రధాన నదులు ఉప్పొంగి ఉరకలేస్తున్నాయి. ఇప్పటికే నిండుకుండల్లా ఉన్న జలాశయాలు ఇక నిల్వచేయలేమంటూ గేట్లు ఎత్తేయాలంటున్నాయి. ఇప్పటికే ఒకసారి శ్రీశైలం గేట్లను ఎత్తివేసి కిందకు నాగార్జునసాగర్‌, పులిచింతల, ప్రకాశం బ్యారేజీలోకి నీరు విడుదల చేసిన à°œ à°² వనరుల శాఖ, మరోసారి గేట్లను ఎత్తి కిందకు నీటి ని వదులుతోంది. గోదావరి నదీ ప్రవాహం నానాటికీ పెరుగుతోంది. ఇప్పటికే లంక గ్రామలు నీటి మునిగాయి. పోలవరం సాగు నీటి ప్రాజెక్టు ముంపు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 14 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండడంతో ధవళేశ్వరం నుంచి కిందకు సముద్రంలో à°•à°¿ నీటిని వదిలేస్తున్నారు. ఇక ఎగువన ఉన్న కర్ణాటక నుంచి కిందకు కృష్ణా జలాలను వదిలేస్తుండడంతో.. జూరాల నుంచి ప్రవాహం శ్రీశైలంలోకి వచ్చేస్తుంది. 2,33,492 క్యూసెక్కుల వరద వస్తుండడంతో, గేట్లను ఎత్తివేసి లక్ష క్యూసెక్కులను కిందకు వదిలేస్తున్నారు. శ్రీశైలం జల విద్యుత్కేంద్రాలు పనిచేయడం ప్రారంభించాయి. ఇక మహారాష్ట్ర, ఒడిసాలో పడుతున్న వర్సాలతో వరద గోదావరి బీభత్సం సృష్టిస్తోంది.
 
తూర్పు గోదావరి పరిధిలో వరద ఉధృతి భయపెడుతోంది. ధవళేశ్వరం వద్ద సోమవారం ఉదయం రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రాత్రి 8 గంటలకు 14,81,674 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి పోతోంది. బ్యారేజీ నీటిమట్టం 15.20 అడుగులకు చేరింది. à°ˆ ఉధృతితో పోలవరం ప్రాజెక్టు ఎగువ భాగంలోని దేవీపట్నంలో 36 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ఇంజన్‌ పడవల మీద జనం రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి! ప్రభుత్వ హాస్టళ్లు, పాఠశాలల భవనాలు, పోలీసు స్టేషన్లలో నీళ్లు చేరాయి. గండిపోచమ్మ గుడి వరదలో చిక్కుకొంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో గర్భిణులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మంటూరులో తీవ్ర పురుటి నొప్పులతో బాధపడుతున్న మహిళను ఐటీడీఏ సిబ్బంది రాజమహేంద్రవరం తరలించారు. అక్కడ ఆమె బిడ్డకు జన్మనిచ్చింది.
 
పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని ముంపు మండలాలను వరద గోదావరి ముప్పేట ముంచేసింది. ఏకంగా పదుల సంఖ్యలో గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. పోలవరం ఎగువున ఉన్న 19 ఏజెన్సీ గ్రామాలు చీకట్లో మగ్గుతున్నాయి. వశిష్ఠ గోదావరి ఉరకలేస్తూ ప్రవహిస్తుండడంతో నరసాపురం-సఖినేటిపల్లి మధ్య నిత్యం తి రిగే పంట్‌ను నిలిపివేశారు. దీంతో వందలాదిమంది రోడ్డుమార్గాన ప్రయాణించాల్సి వస్తోంది. ఉపనదైన శబ à°°à°¿ పొంగి, గోదావరిలో కలుస్తుండటంతో వచ్చే రెండోరోజుల్లో వరద ఉధృతి మరింత తీవ్రంగామారే ప్రమాదం కనిపిస్తోంది. కుక్కునూరు మండలంలో గుండేటివాగును వరదనీరు కప్పేసింది. దాదాపు 1200 ఎకరాల్లో పత్తి, మిర్చి పంటలను నీట ముంచింది. à°ˆ మండలంలోని 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వేలేరుపాడు మండలంలో 32 గ్రామాలకు దారితెన్ను లేకుండా పోయింది. ఎద్దువాగు పూర్తిగా వరదనీట మునగడంతో à°ˆ మండలంలో ఆయా ప్రాంతాలకు వెళ్లే మార్గాలన్నీ మూసుకుపోయాయి. పోలవరం ఎగువున ఉన్న 19 ఏజెన్సీ గ్రామాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.
 
ఇప్పటికే à°ˆ గ్రామాలకు వెళ్లే దారులు తెగిపోయాయి. కోండ్రుకోటలోని పాఠశాల ప్రాంగణంలోకి వరదనీరు చేరింది. ఇంకోవైపు పోలవరం ప్రాజెక్ట్‌కు వెళ్లే మార్గం పూర్తిగా మూసుకుపోయింది. à°ˆ ప్రాజెక్టు స్పిల్‌వే పూర్తిగా నీటమునిగింది. స్పిల్‌వే వద్ద సోమవారం నాటికి 28.44 మీటర్లకు, కాపర్‌ డ్యామ్‌ వద్ద 28.50 మీటర్లకు, పోలవరం ప్రాజెక్టు వద్ద 14.8 మీటర్ల మేర వరద తీరు నమోదైంది. గోదావరిపాయ వశిష్ఠలో వరద అంతకంతకు పెరుగుతోంది. ఆచంట మండలంలో లంకలన్నీ నీటమునిగాయి.