శరాఘాతంగా నూతన మద్యం పాలసీ

Published: Wednesday September 11, 2019
సర్కారు సంపూర్ణ మద్య నిషేధం వైపు అడుగులేస్తున్నప్పటి నుంచి.. ఇప్పటి వరకు à°ˆ రంగంలో ఉన్న వ్యాపారులు పూర్తిగా ఆశలు వదిలేసుకున్నారు. నూతన మద్యం పాలసీలో భాగంగా.. అక్టోబర్‌ ఒకటో తేదీ నుంచి మద్యం విక్రయాలను ప్రభుత్వమే నిర్వహించనుండడంతో.. ఇప్పటి వరకు ఉన్న దుకాణాల్లో à°ˆ నెలాఖరు రాత్రి నాటికి ఒక్క సీసా కూడా మిగలకూడదని మద్యం వ్యాపారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. చివరి సీసా వరకూ వినియోగదారులకే అమ్మాలని నిర్ణయించుకున్నారు. మిగిలిపోయిన మద్యాన్ని ఎక్సైజ్‌ శాఖకు తిరిగి అప్పగించినా.. వ్యాపారులకు ఎలాంటి నగదూ చెల్లించదు. అంటే 30 తర్వాత సరుకు మిగిలిపోతే వ్యాపారుల దృష్టిలో బూడిదలో పోసిన పన్నీరుగానే భావించాల్సి ఉంటుంది. దానివల్ల ఎక్సైజ్‌కు లాభం తప్ప వ్యాపారులకు పైసా తిరిగి రాదు. à°ˆ నేపథ్యంలో.. ఒకేసారి ఎక్కువ మద్యం దిగుమతి చేసుకోకుండా రోజువారీగా.. అదికూడా బాగా డిమాండ్‌ ఉన్న బ్రాండ్ల తీసుకుంటున్నారు. ఆవేశంగా తీసుకుని.. à°† తర్వాత వినియోగదారులు కొనకపోతే నష్టపోవాల్సి వస్తుందని భావిస్తున్నారు.
 
కాగా గతంలోనే కొనుగోలు చేసి అమ్ముడుపోని బ్రాండ్లపై పలుచోట్ల వ్యాపారులు డిస్కౌంట్లు ఇస్తున్నారు. విజయవాడలోని à°“ షాపులో సుమారు రూ.2వేల ఖరీదు చేసే à°’à°• సీసాపై రూ.300కు పైగా డిస్కౌంట్‌ ఇస్తున్నారు. దాంతోపాటు ఒకేసారి మూడు నాలుగు బాటిళ్లు కొంటే లెథర్‌ బ్యాగ్‌లు, టూరిస్ట్‌ బ్యాగ్‌లు ఇస్తున్నారు. గిఫ్ట్‌లు ఉత్పత్తిదారులు ఇస్తున్నారనుకున్నా, డిస్కౌంట్ల నష్టాన్ని మాత్రం వ్యాపారులే భరిస్తున్నారు. విజయవాడతో పాటు పలు నగరాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఎంతో కొంతకు మొత్తం సరుకు ను అమ్మేసుకుందామని à°ˆ పంథాలో వెళ్తున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో à°ˆ తరహా పరిస్థితి ఉంది. పట్టణాల్లో అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి కనుక, అందుకు అనుగుణంగా గతంలో భారీగా సరుకు తీసుకున్నవారు ఇప్పుడు వాటిని వదిలించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. రెండేళ్లకోసారి షాపు లైసెన్సు గడువు ముగిసే సమయంలో మిగిలిపోయిన మద్యాన్ని ఎక్సైజ్‌ శాఖ తీసుకుంటుంది. తిరిగి లైసెన్సు తమకే వస్తుందని ఆశించిన వ్యాపారులు సరుకును నిల్వ పెట్టుకుని, లైసెన్సు దక్కక గతంలో తీవ్రంగా నష్టపోయారు. అయితే ఈసారి పూర్తిగా ప్రైవేటు వ్యాపారం రద్దవుతున్నందున ముందుగానే జాగ్రత్తపడుతున్నారు