యూసీఐఎల్‌ను తొలగిస్తారా...మమ్మల్ని ఇక్కడి నుంచి పంపిస్తారా

Published: Wednesday September 11, 2019
‘‘మా ప్రాంతం నుంచి యూసీఎల్‌ను తొలగిస్తారా.. లేక మమ్మల్ని ఇక్కడి నుంచి మరోచోటకు పంపిస్తారా. ఏదైనా సరే మేము ప్రాణంతో ఉండగానే నిర్ణయం తీసుకోండి’’ అంటూ యూసీఐఎల్‌ ప్రభావిత గ్రామాల ప్రజలు అధ్యయన కమిటీ ముందు ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నియమించిన అధ్యయన కమిటీ రెండు రోజుల పాటు పులివెందుల నియోజకవర్గంలోని యూసీఐఎల్‌ ప్రాంతంలో పర్యటించింది. సోమవారం యూసీఐఎల్‌ను సందర్శించి అధికారులకు పలు ప్రశ్నలు సంధించింది. అనంతరం టెయిలింగ్‌పాండ్‌ను పరిశీలించింది. మంగళవారం ఉదయం 10à°—à°‚à°Ÿà°² నుంచి కేకే కొట్టాల, కనంపల్లె, మబ్బుచింతలపల్లె, భూమయ్యగారిపల్లె, రాచకుంటపల్లె, తుమ్మలపల్లె గ్రామాల్లో పర్యటించింది. కేకే కొట్టాలలో అక్కడి ప్రజలతో అధ్యయన కమిటీ సమావేశమైంది. టెయిలింగ్‌పాండ్‌ కారణంగా భూగర్భజలాలు కలుషితమై మూడు నాలుగు సంవత్సరాలుగా గ్రామంలో తాగడానికి నీరు కూడా లేదని కమిటీ ఎదుట ప్రజలు వాపోయారు. టెయిలింగ్‌పాండ్‌ నుంచి వచ్చే తెల్లని ధూళి పంటలపైన పడ్డంతో పంటలు దెబ్బతిన్నాయని, శరీరాలపై పడి దద్దులు, దురదలు వస్తున్నాయన్నారు. చిన్నపిల్లలు కూడా కీళ్లనొప్పులతో బాధపడుతున్నారని కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. గ్రామస్తులందరికీ ఒంటిపై ఎక్కడపడితే అక్కడ గడ్డలు రావడం, దద్దులు రావడం, కీళ్లనొప్పులు రావడం, మూడు నాలుగు నెలలకే నలుగురు మహిళలకు అబార్షన్లు జరిగాయని అంగన్వాడీ టీచర్‌ వనిత తెలిపారు. అనంతరం కమిటీ సభ్యులు కనంపల్లె గ్రామంలో ప్రజలతో సమావేశమయ్యారు. గ్రామంలో గతంలో 300 కుటుంబాలు ఉండేవని ప్రస్తుతం 150à°•à°¿ చేరాయని, à°Šà°°à°¿ నుంచి మరోప్రాంతానికి వెళ్లేవారి సంఖ్య పెరుగుతూ వస్తోందని తెలిపారు.
 
యురేనియం భూగర్భంలో కలవడంతో పశువులకు సైతం చర్మవ్యాధులు వస్తున్నాయని, వాటి ఎదుగుదల తగ్గిందని, గొర్రెలను, ఆవులను తెచ్చి కమిటీ సభ్యులకు చూపించారు. అనంతరం భూమయ్యగారిపల్లె, తుమ్మలపల్లె, రాచకుంటపల్లె, మబ్బుచింతలపల్లె గ్రామాల్లో కమిటీ పర్యటించింది. à°…à°°à°Ÿà°¿ సాగుచేస్తే ఏడాదిలోపు దిగుబడి వస్తుందని, యురేనియం పుణ్యమా అని ఏడాది దాటినా దిగుబడి పెరగడం లేదని రైతులు వాపోయారు. ఏ పంట సాగుచేసినా పంట ఎదుగుదల లేకుండా దిగుబడి లేకుండా పోతోందని, మీరే న్యాయం చేయాలని వారు కోరారు. వీలైనంత త్వరగా à°’à°• నిర్ణయం తీసుకోవాలని కోరారు. యూసీఐఎల్‌ను ఇక్కడి నుంచి తరలించినా లేదా à°ˆ ప్రాంతం నుంచి తమను పంపించినా.. ఏదైనా త్వరగా నిర్ణయం తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. తాము బతికి ఉండగానే నిర్ణయం తీసుకోవాలని ఆవేదన వ్యక్తంచేశారు.